తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. గతంలో తన రాజకీయ ప్రత్యర్థుల పై తరచూ విరుచుకుపడే ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రిపై మాత్రం ఆన్ అండ్ ఆఫ్ గా విమర్శలు చేస్తున్నారు.
తాజాగా కేసీఆర్ పై విమర్శలు చేసిన ఆయన.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తానని చెప్పినప్పటికీ.. దుర్భర నగరంగా మారుస్తారంటూ ఆయన మండిపడుతున్నారు. గుంతలేని రాజధానిగా మారుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి అప్పుడెప్పుడో చెప్పటం.. ఇప్పటివరకూ అలాంటిదేమీ లేకపోవటం తెలిసిందే.
ఈ అంశాన్ని తాజాగా ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. హైదరాబాద్ లో ఏ ఒక్క రోడ్డునైనా సరే.. గుంతల్లేనిది చూపిస్తే.. తాను రూ.లక్ష ఇస్తానని సవాలు విసిరారు. గతంలో గ్రేటర్ పరిధిలోని రోడ్లలో గుంత చూపిస్తే వెయ్యి రూపాయిలు ఇస్తామని తెలంగాణ అధికారులు ప్రకటించారని.. ఇప్పుడు తాను రూ.లక్ష అవార్డు ప్రకటిస్తానని సవాలు విసిరారు.
గతంలో నెంబర్ వన్ గా ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని ఇప్పుడు.. టీఆర్ ఎస్ పాలకులు స్వచ్ఛతలో 272 స్థానానికి తీసుకెళ్లారని విమర్శించారు. సో.. కిషన్ రెడ్డి దగ్గర రూ.లక్ష తీసుకోవాలంటే గుంతల్లేని ఒక్కరోడ్డు చూపిస్తే చాలు.మరి.. దీనికి గులాబీ నేతలు ఏం సమాధానం ఇస్తారో..?