బీజేపీ శాసనసభ్యులు - శాసనసభాపక్ష నాయకులు జి.కిషన్ రెడ్డికి చిత్రమైన సమస్య ఎదురైంది. ఆయన వెబ్ సైట్ హ్యాక్ అయింది. అయితే ఇది చేసింది పాక్ వర్గాల పనే అని ఆయన అనుమానించారు. ఈ విషయంలో తగు చర్యల కోసం ఆయన డీజీపీని కూడా ఆశ్రయించారు. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. గత 12 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్న తను ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు వెబ్ సైట్ తో ముందుకు వెళ్తుండగా ఇది హ్యాక్ అయిందని పేర్కొన్నారు.
ఈ మేరకు కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. `మా వెబ్ సైట్ నిన్న రాత్రి హ్యాకింగ్ గురైన విషయం మా దృష్టికి వచ్చింది. హ్యాకింగ్ జరిగిన ఆధారాలను బట్టిచూస్తే ఇది పాకిస్తాన్ కు సంబంధించిన వ్యక్తులు లేదా దేశ వ్యతిరేక శక్తుల పని అని మేము భావిస్తున్నాం. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి - ఐజీ ఇంటలీజెన్సీకు - హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్స్ డీసీపీకి ఫిర్యాదు చేశాం. ఇటువంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సైబర్ చట్టాల ఆధారంగా పూర్తిస్థాయిలో దర్యాప్తుచేసి కఠినంగా శిక్షించాలి` అని కిషన్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి - ఇది నిజంగా పాకిస్తాన్ గానీ మరే ఇతర దేశ వ్యతిరేక శక్తుల ద్వారానే ఈ హ్యాకింగ్ జరిగి ఉంటే - దీనిపై అవసరమైతే కేంద్ర సహకారం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని తన లేఖలో కిషన్ రెడ్డి కోరారు.