బీజేపీ అగ్రనేత - తెలుగురాష్ర్టాల్లో కమళనాథులకు పెద్దదిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు భారత ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన నేపథ్యంలో ఆ పార్టీలో కొత్త చర్చలు మొదలైన సంగతి తెలిసిందే. పార్టీకి అంత పెద్ద దిక్కు ఎవరనే కలవరం మొదటిదైతే...ఏపీ కోటాలో ఎవరికి మంత్రి పదవి దక్కనుందనే చర్చ మరొకటి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఉన్న రెండు కేంద్రమంత్రి పదవులు కూడా తెలుగుదేశం కే కేటాయించారు. దీంతో వెంకయ్య స్థానంలో భర్తీ చేయబోయే పదవి బీజేపీ ఎంపీకే దక్కుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు. పార్టీ అగ్రనేతగా ఉన్న వెంకయ్యనాయుడుకు హోదా మారేసరికి ఏపీకి మరో మంత్రిపదవిని ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానవర్గం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు - విశాఖపట్నం ఎంపీ అయిన కంభంపాటి హరిబాబుకు అవకాశం దక్కుతుందని అంటున్నారు.
బీజేపీ ఎంపీ - రాష్ట్ర రథసారథి హరిబాబు గురించి తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన గురించి మీడియాతో మాట్లాడిన మురళీధర్ రావు ఈ నెలాఖరులో అమిత్ షా ఏపీలో పర్యటిస్తారని చెప్పారు. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకుంటారని వివరించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అనే ప్రశ్నకు బదులిస్తూ ‘ఆయనకు ఏదో ఒకటి ఇస్తారు, రోడ్డుమీదైతే వదిలివేయరు కదా?’ అని ఎదురు ప్రశ్న వేశారు. కాగా, హరిబాబు విషయంలో మురళీధర్ రావు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇదిలాఉండగా... బీజేపీకి ఏపీ తరపున కేంద్రం మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే వెంకయ్యనాయుడు కూడా హరిబాబు పేరునే సూచిస్తారనే ప్రచారం ఉంది. హరిబాబు ఎప్పటినుంచో కేంద్రంలో మంత్రి పదవి కోసం ఎదురుచూస్తుండటాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. కాగా, ఏపీ నుంచి విమానాయనశాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఆ శాఖ పరిధులు దాటి సొంత రాష్ట్రం కోసం ఆయన ఏమి చేసినా దాఖలాలు లేవనే భావన పలువురిలో ఉంది. మరో మంత్రి అయిన సుజనా చౌదరి నిర్వహిస్తున్నశాఖ రాష్ట్రానికి పెద్దగా మేలు చేసేది కాదు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడును కీలకమైన శాఖ నుంచి దూరం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు లోటు చేశామనే భావన లేకుండా ఉండేందుకు రాష్ట్ర బీజేపీకి చెందిన వారికే కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని అభిప్రాయం వినిపిస్తోందని అంటున్నారు.