సీఏఏను వ్యతిరేకిస్తే.. తలలు నరుకుతాడట

Update: 2020-02-21 05:15 GMT
నోరున్నది ఇష్టారాజ్యంగా మాట్లాడటానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్న రాజకీయ నేతలు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ఆచితూచి అన్నట్లు మాట్లాడే నేతలు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపులర్ కావటానికి.. తనను పక్కన పెడుతున్న పార్టీకి ఝులక్ ఇవ్వటానికే అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న నేతల జాబితాలో తాజాగా తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు.. షాకింగ్ గా మారాయి. మోడీ సర్కారు తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేశారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారి తలల్ని నరికేసేందుకు కత్తి పట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గల్లీ తీర్మానాలతో కేంద్రాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉడత ఊపులకు భయపడేందుకు కేంద్రంలో ఉన్నది రాజీవ్.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు కావని.. మోడీ ప్రభుత్వమంటూఅవసరానికి మించిన ఆర్భాటపు వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్ గా మారింది.

సొంత పార్టీలో రఘునందన్ ను పక్కన పెట్టటంతో.. తన ఉనికిని చాటుకునేందుకు వీలుగా దరిద్రపుగొట్టు వ్యాఖ్యలు చేసిన ఆయన తీరును పలువురు తప్పు పడుతున్నారు. తన మాటలతో కేంద్రానికే కాదు.. సొంత పార్టీ నేతలకు సైతం షాకిచ్చారని చెప్పక తప్పదు. కేవలం తెలంగాణను పాలించే కేసీఆర్ కే అంతుంటే.. దేశాన్ని పాలించే మోడీకి ఇంకెంత ఉండాలంటూ నోరు పారేసుకున్న ఆయన తీరును.. ఆయనతో పాటు ప్రోగ్రాంలో పాల్గొన్న సైదాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ స్వర్ణలతారెడ్ి అభ్యంతరం చేసినా..అదేమీ పట్టించుకోకుండా వ్యాఖ్యలు చేయటం చూస్తే.. పాపులర్ కావాలన్న తాపత్రయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది.


Tags:    

Similar News