బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అన్న విషయాన్ని దేశంలో చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతారు. తామెంత చేసినా ముస్లిం ఓటర్లు తమకు ఓట్లు వేయరంటూ పలువురు బీజేపీ నేతలు చెబుతుంటారు. అయితే.. ఆ మధ్య జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు సైతం పెద్ద ఎత్తున బీజేపీ ఓట్లు వేశారంటూ కొన్ని లెక్కలు చెప్పుకొచ్చారు. ఈ కారణంతోనే యూపీలో బీజేపీ భారీ ఎత్తున విజయం సాధించిందన్న అభిప్రాయం ఉంది.
ఇదిలా ఉంటే.. అదే ఉత్తరప్రదేశ్ లో ముస్లిం ఓట్ల కోసం ఆ ఓటర్లను తీవ్రస్థాయిలో హెచ్చరిక చేసిన బీజేపీ నేత నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ముస్లింలు ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ బీజేపీ నేత రంజిత్ కుమార్ శ్రీవాస్తవ ఇచ్చిన వార్నింగ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
బారాబంకి జిల్లాలో తన భార్య తరఫున ప్రచారం చేసిన శ్రీవాస్తవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కానీ ఓట్లు వేయని పక్షంలో ముస్లింలకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెబుతూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు బెదిరించే ధోరణిలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
నాలుగురోజుల క్రితం (నవంబరు 13న) ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఆయన ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. ఈ స్థానిక నేత చేసిన హెచ్చరికలన్నీ రాష్ట్ర మంత్రులు దారా సింగ్ చౌహాన్.. రమాపతి శాస్త్రిల ముంగిట్లోనే జరగటంతో యోగి సర్కారు చిక్కుల్లో పడింది. అభివృద్ధి జరగాలంటే బీజేపీ కార్పొరేటర్లను గెలిపించుకోవాలని.. లేదంటే అభివృద్ధి గురించి మర్చిపోవాలంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేయటం గమనార్హం.
ఇదిల ఉంటే.. తన వీడియో వైరల్ కావటంతో.. తనపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రంజిత్ కుమార్. తాను బీజేపీకే ఓటు వేయాలని అనుకోలేదని.. తమ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుందని మాత్రమే చెప్పానని.. ఈ క్రమంలో తాను ఎవరినీ బెదిరించలేదన్నారు. వీడియో క్లిప్ బయటకు వస్తేనే ఇన్ని మాటలు మాట్లాడుతున్న పెద్ద మనిషి.. వీడియో క్లిప్ లేకుంటే.. తన మీద వచ్చిన ఆరోపణలకు ఇంకేం చెప్పేవారో..?
Full View