ప్లానింగ్ కు బ్రేక్ ఇస్తారా..పాత ప్లాన్ తోనే వెళ‌తారా?

Update: 2019-07-24 05:21 GMT
చేజారింద‌నుకున్న‌ క‌ర్ణాట‌క చేతికి చిక్కిన‌ట్లే. వాట్ నెక్ట్స్? అన్న‌ది ప‌లువురి నోట వినిపిస్తున్న ప్ర‌శ్న‌. ఇదే సందేహాన్ని బీజేపీ నేత‌ల వ‌ద్ద ప్ర‌స్తావిస్తే.. వారి స్పంద‌న చాలా స్ప‌ష్టంగా ఉండ‌టం విశేషం. క‌ర్ణాట‌క అయిపోతే.. ఆప‌రేష‌న్ బెంగాలే అని కొంద‌రు నేత‌లు అంటుంటే.. కాదు..కాదు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ అన్న మాట‌ను మ‌రికొంద‌రి నోట వినిపిస్తోంది.

అరే.. క‌ర్ణాట‌క లెక్క కొలిక్కి తెచ్చేందుకు ప‌డిన శ్ర‌మ మ‌ర్చిపోయారా?  అంత త్వ‌ర‌గా మ‌రో రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తారంటారా?  కాస్త బ్రేక్ ఇచ్చి మ‌ళ్లీ మొద‌లు పెడతారేమో? అన్న ప్ర‌శ్న‌కు.. క‌మ‌ల‌నాథుల నోటి నుంచి వ‌స్తున్న స‌మాధానం వింటే అవాక్కు అవ్వాల్సిందే.

ఎందుకంటే.. త‌మ‌కు బ్రేక్ అంటే తెలీద‌ని.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఉన్న టాస్క్ ల‌ను పూర్తి చేసుకుంటూ వెళ్లిపోవ‌ట‌మే త‌ప్పించి.. ఒక‌టి పూర్తి అయ్యాక కాస్తంత బ్రేక్ తీసుకొని.. వ్యూహాల పెట్టెను తెరిచి.. క‌స‌ర‌త్తు చేయ‌టం లాంటివేమీ ఉండ‌వ‌న్న మాట వినిపిస్తోంది. ఎన్నో నెల‌లుగా టార్గెట్ చేసిన క‌ర్ణాట‌క వ్య‌వ‌హారం కొలిక్కి వ‌చ్చేసి.. అధికారం చేతికి వ‌చ్చేసిన నేప‌థ్యంలో త‌మ త‌ర్వాతి టార్గెట్లు సిద్ధంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ఇంత ర‌చ్చ జ‌రిగి క‌ర్ణాట‌క‌లో అధికార బ‌దిలీ జ‌రుగుతున్న వేళ‌లో.. ఆ వెంట‌నే మ‌రో రాష్ట్రం మీద దృష్టి పెడితే ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న కారా?  వ్య‌తిరేక‌త పెల్లుబుకే ప్ర‌మాదం ఉంది క‌దా? అన్న ప్ర‌శ్న‌ల‌కు బీజేపీ నేత‌లు ఇస్తున్న స‌మాధానం వింటే.. అవాక్కు అవ్వాల్సిందే. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో దేశ వ్యాప్తంగా మోడీకి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాద‌ని.. తాము చేస్తున్న‌వేమీ కొత్త విష‌యాలు కావ‌ని.. ఇప్ప‌టికే కాంగ్రెస్ అనేక సంద‌ర్భాల్లో ఇలాంటివెన్నో చేసింద‌ని.. దాంతో పోలిస్తే.. తాము చేస్తున్న‌వేమీ ప్ర‌జ‌లు సీరియ‌స్ గా తీసుకోర‌న్న మాట చెప్ప‌టం విశేషం.

అంతేకాదు.. తాము టార్గెట్ చేస్తున్న రాష్ట్రాల్లో అక్క‌డి ప్ర‌భుత్వాల మీద స్థానిక ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్నవే ఎక్కువ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దంటున్నారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న చోట‌నే తాము ఆప‌రేష‌న్స్ స్టార్ట్ చేస్తామ‌ని.. ప్ర‌జ‌ల ద‌న్నుతో పాటు.. రాజ‌కీయంగా త‌మ‌కు క‌లిసి వ‌చ్చే అంశాల మీద ఫోక‌స్ చేయ‌టం వ‌ల్లే త‌మ‌కు ఎలాంటి ఎదురుదెబ్బ‌లు త‌గ‌టం లేద‌ని బీజేపీ నేత‌లు విశ్లేషిస్తున్నారు.

క‌మ‌ల‌నాథుల స్పీడ్ చూస్తుంటే.. బ్రేక్ ఇచ్చే క‌న్నా.. బ్యాక్ టు బ్యాక్ తాము పాగా వేయాల‌నుకున్న రాష్ట్రాల్లో క‌మ‌లం జెండాను ఎగుర‌వేయ‌టం త‌ప్పించి మ‌రో ల‌క్ష్యం వారికి లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.



Tags:    

Similar News