అక్క‌డ బీజేపీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు!

Update: 2019-05-05 16:10 GMT
ప‌వ‌ర్ ఎంత చిత్ర‌మైన‌ది? దానికంటూ ఒక రూపం లేకున్నా..  ఎవ‌రైతే దాన్ని బాగా చెలాయించే స‌త్తా ఉంటారో వారికి ఆయుధంగా మారుతుంది. ప‌వ‌ర్ చేతికి వ‌చ్చాక.. అవ‌త‌టోళ్లు ఎంత బ‌ల‌వంతులైనా స‌రే.. దాని ధాటికి బెంబెలేత్తి పోవాల్సిందే.  ప‌వ‌ర్ చేతిలో ఉంటే స‌రిపోదు?  దాన్ని వాడేయ‌టంలో నైపుణ్యం చాలా అవ‌స‌రం. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేతిలో ప‌వ‌ర్ ఉంది. కానీ.. ఆయ‌న అదే ప‌నిగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. త‌న‌ను సీఎస్ లెక్క చేయ‌టం లేద‌ని.. త‌న వ‌ద్ద‌కు రావ‌ట్లేదంటారు. కేబినెట్ మీటింగ్ పెట్టి మొత్తంగా క‌డిగేస్తాన‌ని రంకెలు వేస్తారు. ప‌వ‌ర్ చేతిలో ఉన్నా.. దాన్ని ఎలా ఉప‌యోగించాలో బాబుకు అర్థం కావ‌ట్లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

మ‌రి.. ఏపీకి పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్- జేడీఎస్ స‌ర్కారు దెబ్బ‌కు బీజేపీ నేత‌లు హాహాకారాలు చేస్తున్నారు. క‌ర్ణాట‌క స‌ర్కారు త‌మ‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తుంద‌ని వారు వాపోతున్నారు. క‌ర్ణాట‌క అధికార‌ప‌క్షానికి ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని తేల‌టంతో బీజేపీ నేత‌ల్ని టార్గెట్ చేశారంటున్నారు.

ప్ర‌ధాన‌మంత్రి మోడీని హ‌త్య చేయాల‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన మాజీ ఎమ్మెల్యే బేళూరు గోపాల‌కృష్ణ‌.. ప్ర‌ముఖ న‌టి సుమ‌ల‌త‌తో పాటు.. న‌టులు ద‌ర్శ‌న్.. య‌శ్ ల‌పై ప‌దే ప‌దే అవ‌హేళ‌న చేసిన జేడీఎస్ ఎమ్మెల్యే నారాయ‌ణ‌గౌడ‌పై ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ర్య‌లు తీసుకోపోవ‌టం ఏమిట‌న్న‌ది క‌మ‌ల‌నాథుల క్వ‌శ్చ‌న్ గా ఉంది.  ఈసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌త్యేక‌త ఏమంటే.. కొన్నిచోట్ల అధికార‌ప‌క్షం హాహాకారాలు చేస్తుంటే.. మ‌రికొన్నిచోట్ల ప్ర‌తిప‌క్షం బెంబెలేత్తి పోతోంది. ప‌వ‌ర్ ను ఎవ‌రైతే ఎఫెక్టివ్ గా వాడుతున్నారో.. వారంతా త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై చెల‌రేగిపోతున్నార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

క‌ర్ణాట‌క ఎపిసోడ్ విష‌యానికి వ‌స్తే..  త‌మ ఫిర్యాదుల‌పై చ‌ర్య‌లు తీసుకోని నేప‌థ్యంలో తాము పెద్ద ఎత్తున నిర‌స‌న నిర్వ‌హిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ నెల ఆరున క‌ర్ణాట‌క వ్యాప్తంగా ధ‌ర్నాలు చేప‌ట్ట‌నున్న‌ట్లుగా బీజేపీ నేత‌లు వెల్ల‌డించారు.


Tags:    

Similar News