ప్రముఖ నేతల్ని పిసకటమే పనిగా పెట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయన్న ఆరోపణ తెలుగు పాఠకుల నుంచి ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఏ ప్రముఖ మీడియా సంస్థ చూసినా ఏదో ఒక స్టాండ్ తీసుకొని పిసకటమే పనిగా పెట్టుకుంటున్నారే కానీ.. తామరాకు మీద నీటిబొట్టులా ఉండి.. తప్పు చేస్తే కడిగిపారేయటం.. ఒప్పు చేస్తే నెత్తి మీదకు ఎక్కించుకోవటం అన్నది వదిలేశారన్న విమర్శ ఉంది.
ఇలాంటి వేళలోనే ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ.. ఆయనపై గడిచిన మూడు రోజులుగా చేస్తున్న సునిశిత విశ్లేషణ ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు.. మోడీ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీసేలా ఉంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో మోడీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించి.. ఆయనలోని నెగిటివ్ కోణంలో వార్తలు రాసింది లేదు. దీంతో మీడియా సంస్థ పైనా.. దాని యజమాని పైనా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికలకు దగ్గరగా వస్తున్న వేళలో.. ఇలాంటి కథనాలు పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తాయన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఓపక్క ఏపీ ప్రత్యేక హోదా కారణంగా ఏపీ ప్రజలు మోడీ పట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలిసిందే. ఇదే సమయంలో పెద్ద నోట్ల రద్దు.. జీఎస్టీ.. ముడిచమురు ధరల్ని అంతకంతకూ పెంచేస్తున్న వైనంతో మోడీ అంటే సామాన్యుడు సైతం మండిపడుతున్న పరిస్థితి. ఇలాంటి వేళలో.. ఆయన వ్యక్తిత్వాన్ని.. నడకను.. నడతను విశ్లేషించటం.. ఆయనలోని అహంకారకోణాన్ని బయటపెట్టటం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. తమ ముఖ్యనాయకుడ్ని బద్నాం చేసేలా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలు ఇవ్వటంపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. మోడీ మీద ప్రత్యేక కథనాలు ఇస్తున్న మీడియా అధినేత . ఇదే రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా ఇదే తీరులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైనా విశ్లేషణలు ఎందుకు ఇవ్వటం లేదన్నది బీజేపీ వర్గాల వారి ప్రశ్న.
ఏపీలో మోడీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్టాండ్ తీసుకున్న కొద్ది రోజులకే.. మోడీ క్యారెక్టర్ ను బద్నాం చేసేలా కథనాలు వస్తున్న వైనంపై మండిపడుతున్నారు. బాబుకు దన్నుగా నిలిచేలా.. బాబు పోరాడుతున్నది ఒక హీరో మీద కాదన్నట్లుగా కథనాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇలాంటి వేళ.. బీజేపీ వర్గాలు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. మీడియా అధినేత కు దమ్ము ఉంటే ఇద్దరు చంద్రుళ్ల మీదా ఇదే సిరీస్ నడిపిస్తే.. ఆయన్ను వేలెత్తి చూపించటం తప్పన్న మాట వినిపిస్తోంది. మరి.. అయన లోని జర్నలిస్ట్ ను ప్రశ్నిస్తున్న బీజేపీ వర్గాల వారికి ఆయనేం సమాధానం చెబుతారో..?