సాధారణంగా ఎన్నికల తంతు మొదలవగానే అసెంబ్లీ టిక్కెట్లు ఆశించే ఆశావహులు అధిష్ఠానం వద్ద క్యూ కడతారు. వివిధ రకాల్లో రాయబారాలు పంపుతూ తామే బెస్ట్ అని, సీటు కేటాయిస్తే గెలుపు ఖాయమని చెబుతుంటారు. సిఫార్సులు చేయిస్తూ ఉంటారు. కానీ, తెలంగాణా ఎన్నికల్లో ప్రస్తుతం అధిష్ఠానం, రాష్ట్ర ఇన్ చార్జిలతో సంబంధం లేకుండా బీజేపీ నేతలు పరిపూర్ణానంద స్వామి దయ కోసం క్యూ కడుతున్నారు.
పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా - రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ దగ్గర ఓ లిస్టు ఉంటుంది. అయితే, పరిపూర్ణానంద స్వామి వద్ద కూడా ఓ లిస్టు తయారు చేసుకొని పెట్టుకున్నారట. ఆ లిస్టులో ఎవరి పేరు ఉంటే వారికి సీటు ఖాయమని చెబుతున్నారట. పరిపూర్ణానంద ఇప్పటికే ఢిల్లీకి వెళ్లివచ్చారు. పార్టీ పెద్దలతో రహస్య భేటీ చేసి వచ్చారు. అమిత్ షాతో సమావేశమైనట్లు ఓ ఫొటొ కూడా హల్ చల్ చేసింది. ఆయనకు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, పరిపూర్ణనంద ఎవరికి చెబితే వారికి టిక్కెట్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.
రాష్ట్రంలో చాలా చోట్ల బీజేపీకి సరైన అభ్యర్థులు లేరు. అయినా, మేకపోతు గాంభీర్యంగానే బరిలోకి దిగుతుంది. ఒక్క నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి నియోజకవర్గాల్లో మాత్రమే టిక్కెట్ వార్ సాగుతుంది. లక్ష్మీనారాయణ - బస్వ లక్ష్మీనరసయ్య - థన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ అర్బన్ కు పోటీ పడుతున్నారు. లక్ష్మీనారాయణ - లక్ష్మీనరసయ్యలు బీజేపీ పెద్దలతో రాయబారాలు నడుపుతుంటే - పరిపూర్ణనంద సిఫార్సు కోసం థనపాల్ సూర్యనారాయణ తంటాలు పడుతున్నారట. బీజేపీకి స్వామి ఇచ్చిన లిస్టులో తన పేరు ఉందని చెబుతూ ప్రచార రంగంలోకి దిగేశారు. అటు కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి రెడీ అయిన మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణ రెడ్డి కూడా పరిపూర్ణానంద లిస్టులో ఉన్నట్లు చెబతున్నారట.
తెలంగాణా బీజేపీలో ఇప్పుడు పరిపూర్ణానంద స్వామిదే హవా. ఆయన ఎంత చెబితే అంత అనేలా ఉంది. ఎవరికి సిఫార్సు చెస్తే వారికి సీటు పక్క అనే ప్రచారం జరుగుతుండటంతో, ఆ స్వామి దగ్గరకు ఆశావహులు క్యూ కడుతున్నారు. దీంతో పరిపూర్ణానందపై బీజేపీలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఈయన కూడా ఎక్కడ నుంచైనా పోటీ చేస్తారా లేదా కేవలం ప్రచారానికే పరిమితమవుతారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీలో చెలరేగిన పరిపూర్ణానంద తుఫాను ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.