ప్రత్యేక హోదా రాకపోవడానికి గల కారణాలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం చిన్న చూపు అని కొందరంటే.. తనపై ఉన్న కేసులకోసం - పోలవరం ప్రాజెక్టు కాంట్రక్టులకోసం చంద్రబాబే ప్రత్యేకహోదాని తాకట్టుపెట్టారని మరికొంతమంది రాజకీయ విమర్శలు చేస్తున్నారు. మన ఎంపీల చేతకాని తనమే దీనికి కారణమని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే ఇది కాదు అసలు విషయం.. అని తాజాగా ఒక కథనం వెలుగులోకి వచ్చింది. ఈ కథనం ప్రకరాం... ప్రత్యేక హోదా అంటే తమకు తెలియదని - డబ్బులు వస్తేనే చాలని చాలా మంది ఏపీ ప్రజలు చెప్పారట.. ఈ మేరకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు రహస్యంగా చేయించుకున్న సర్వేలు ఈ వివరాలు తెలిపాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఎన్నో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది ఈ కథనం!
ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో నిరసన మంటలు రేగుతున్న తరుణంలో.. "హోదా వద్దు - దాని వల్ల పెద్దగా ప్రయోజనాలు లేవు, ఉన్నా కూడా వాటికంటే ఎక్కువ ప్రయోజనాలున్న ప్యాకేజీ నే ప్రజలు కోరుకున్నారు" అని హోదా లేదు ప్యాకేజీయే అనే నేరాన్ని ప్రజల కోరికగా చూపించే ప్రయత్నాలు మొదలైపోయాయి. ప్రత్యేక హోదా అనే విషయంపై జరుగుతున్న హడావిడిని గమనించిన ఢిల్లీ పెద్దలు అసలు ఏపీలో ప్రత్యేకహోదా ఆకాంక్ష ఎలాఉందో - క్షేత్రస్థాయిలో ప్రజలనాడి ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించి నిఘావిభాగాన్ని రంగంలోకి దించి.. సర్వే నిర్వహించారట. ఈ సర్వేలో వారికి... "ప్రత్యేకహోదా అంటే ఏమిటో తమకు తెలియదనీ - ఏపీకి డబ్బులు వస్తే చాలనీ" ఎక్కువమంది కోరుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందంట. అయితే కేవలం ఇరవై నుంచి ఇరవై అయిదు శాతం మంది మాత్రమే "హోదా వస్తే పరిశ్రమలు వస్తాయనీ - ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనీ, ఆర్ధికంగా కూడా బాగుపడతామంటూ చెప్పారని, అది కూడా చాలా మంది నేతలు చెప్పడం వల్లేనని" చెప్పుకొచ్చారట. ఈ విషయాలను పరిగణలోకి తీసుకునే.. హోదా కంటే ప్యాకేజీ ఇస్తేనే బెటరని కేంద్రంలోని పెద్దలు భావించి, వారు చేయించిన సర్వేలోని ప్రజల కోరిక మేరకు ప్యాకేజీ ఇచ్చారంట.
వినడానికి ఆశ్చర్యంగానూ - మరికొంతమందికి అసహ్యంగానూ అనిపిస్తున్న ఈ సమర్ధింపు కథనం అత్యంత దారుణమైన విషయమే చెబుతున్నారు ఏపీ ప్రజలు. ఈ సమయంలో రాష్ట్ర నిఘావిభాగం కూడా ప్యాకేజీ ప్రకటించిన అనంతరం ఒక మెరుపు సర్వే చేయించిందట. ఈ విషయంలో కూడా ప్రజలు "హోదా అంటే ఏమిటో తెలియదనీ, ఏదో ఒక రూపంలో రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని" మాత్రమే కోరుకున్నారట. ఈ స్థాయిలో.. హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని ప్రజలే కోరుకున్నారని చెప్పే ప్రయత్నాలు - అధికారికంగా ప్రజలను - విద్యార్థులను - రేపటి పౌరులను మోసం చేసే కార్యక్రమాలు మొదలైపోయాయన్న మాట.
కాసేపు ఇదే నిజమని అనుకున్నా.. ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియదని గ్రామాల్లోని ప్రజలు అని ఉంటే అని ఉండొచ్చు గాక.. కానీ ఆ వాగ్ధానం చేసిన వారికి - ఈ ప్రశ్నలు ప్రజలను అడగమన్న వారికీ తెలుసుకదా... ఇప్పటికిప్పుడు వచ్చే ప్యాకేజీ పేకెట్ కంటే - హోదా అనేది ఎన్నో రెట్లు మెరుగని, భావితరాలకు ఆశాజ్యోతి అని! అన్నీ తెలిసి చేసే మోసాన్ని - నమ్మక ద్రోహాన్ని ప్రజలపైకి నెట్టే ప్రయత్నం ఎందుకో??