ఇదేం జోక్ కాదు. ఎద్దేవా అంతకన్నాకాదు. నిజ్జంగా నిజమే! ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో అంతర్గతంగా కలిసి పోయి.. వ్యవహరిస్తు న్నారని బీజేపీ నేతలపై అక్కసు వెళ్లగక్కేవారికి షాకిచ్చే ఘటన. విషయం ఏంటంటే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేతృత్వంలో నాయకులు చేస్తున్నపోరుకు కేంద్ర బీజేకపీ పెద్దల నుంచి పెద్ద ఎత్తున ఆశీస్సులు.. అభినందనలు.. అన్నీ లభించాయి. అంతేకాదు.. ఇదే తరహా పోరును కొనసాగించాలని.. వైసీపీని 'ఇలానే' చీల్చి చెండాడాలని కూడా పెద్దలు దిశానిర్దేశం చేశారట.
ఈ విషయాన్ని స్వయంగా బీజేపీఏపీ చీఫ్ సోము వీర్రాజు తాజాగా వెల్లడించారు. తాజాగా రెండు రోజుల పాటు ఢిల్లీ వేదికగా జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఏపీకి సంబంధించిన బీజేపీ వ్యవహారాలపైనా చర్చ జరిగింది. ఈ క్రమంలో ఏపీలో సోము వీర్రాజు నేతృత్వంలో వైసీపీ సర్కారుపై బీజేపీ నేతలు చేస్తున్న పోరును కమలం పార్టీ పెద్దలు ప్రశంసించారని సోము చెప్పుకొచ్చారు. ఈ మూడున్నరేళ్లలో మిత్రపక్షం జనసేనతో సంబంధం లేకుండానే బీజేపీ నేతలు ప్రజాపోరుతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టారు.
స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తో పాటు 5 వేల సభలు నిర్వహించారు. వీటిపై హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ పోరును హైకమాండ్ ప్రశంసించినట్లు వీర్రాజు ట్వీట్ చేశారు.
ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర యూనిట్ నిర్వహించిన ప్రజా పోరు కార్యక్రమంపై హైకమాండ్ సంతృప్తి వ్యక్తంచేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ-వైసీపీ మధ్య పరోక్షంగా అవగాహన ఉన్నట్లు ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నా అవి కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉండే సహజ సంబంధాలేనని వీర్రాజు చెబుతున్న విషయం తెలిసిందే.
అందుకే క్షేత్రస్దాయిలో వైసీపీ సర్కార్ విధానాలపై పోరాటం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే అంశంపై ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలోనూ రాష్ట్ర నేతలకు అధిష్టానం మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై పోరు కొనసాగించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే.. మరోవైపు.. రాష్ట్రంలో ప్రత్యక్షంగా ఉన్న పరిస్థితిని చూస్తే.. మాత్రం ఎక్కడో అంతర్గత ఒప్పందం కుదిరినట్టుగా వ్యవహారం సాగుతోందని పోరాటంలో 'పస' ఉండడం లేదనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.