ట్వీట్ల‌తో టీఆర్ ఎస్ దుమ్ముదులిపిన బీజేపీ

Update: 2018-09-02 16:17 GMT
బీజేపీతో జాతీయ స్థాయిలో టీఆర్ ఎస్ రాసుకుపూసుకు తిరుగుతున్నా రాష్ట్ర శాఖ మాత్రం ఆ చొర‌వ చూపించ‌డం లేద‌ని తాజాగా వెల్ల‌డ‌వుతోంది. ఈరోజు ప్ర‌గ‌తి నివేద‌న స‌భ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ భారీ హంగామా చేస్తున్న నేప‌థ్యంలో అస‌లు ఆ పార్టీవ‌న్నీ అబద్ధాల‌ని... 63 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుని ఆ సంఖ్య‌ను జంపింగ్‌ లతో 90కి చేర్చుకోవ‌డ‌మే టీఆర్ ఎస్ ప్ర‌గ‌తి అని బీజేపీ ట్విట్ట‌ర్ వేదిక గా టీఆర్ ఎస్‌ ను ఆడుకుంది.

కేసీఆర్ లైస్ స‌భ (కేసీఆర్ అబ‌ద్ధాల స‌భ‌) హ్యాష్ ట్యాగ్‌ తో బీజేపీ చేసిన వ‌రుస ట్వీట్లు ఇవే.

ప్ర‌గ‌తి కాదు.. అప్పుల‌తో అథోగ‌తి.

ఇదేనా ప్ర‌గ‌తి... 63 మంది ఎమ్మెల్యేల‌ను 90కి అక్ర‌మంగా పెంచుకోవ‌డ‌మా?

అప్పులు పెర‌గ‌డం ప్ర‌గ‌తి కాదు.

రూపాయికి కిలో బియ్యం ఇస్తున్న‌ది ఎవ‌రు?

టీఆర్ ఎస్ పాల‌నలో ఎవ‌రు ప్ర‌గ‌తి చెందారు? కేసీఆర్ కుటుంబ‌మా?  నిరుద్యోగులా?

కేసీఆర్ కిట్స్‌ లో ఎవ‌రి వాటా ఎంత‌?

అయితే, ప్ర‌తి ట్వీట్‌ కు ఇమేజ్ చేసి మ‌రీ వివ‌రాలు  పేర్కొంది. కేసీఆర్ పెట్టిన ప్ర‌తి ప‌థ‌కంలో కేంద్ర ప్ర‌భుత్వం వాటా సగం ఉంద‌ని, కేంద్రం డ‌బ్బుల‌తో అభివృద్ధిని చేస్తూ తాను చేసిన అభివృద్ధిగా కేసీఆర్ అబ‌ద్ధాలు చెప్పుకుంటున్నార‌ని బీజేపీ ఆరోపించింది. కేసీఆర్ కిట్‌కు కేంద్రం 6 వేలు ఇస్తే - రాష్ట్రం 6 వేలు ఇస్తోంది. కానీ పేరు మాత్రం కేసీఆర్ ది పెట్టారు. ప్ర‌తి ప‌థ‌కంలోనూ ఇదే జ‌రుగుతోంది? అన్నీ అబ‌ద్ధాలే అంటూ కేసీఆర్‌ ను బీజేపీ ఏకేసింది.
   

Tags:    

Similar News