బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా సింధియా.. ఎక్కడినుంచంటే?

Update: 2020-03-12 05:48 GMT
కాంగ్రెస్ ను కాలదన్ని అలా పార్టీ చేరగానే ఇలా బీజేపీ పట్టం కట్టేసింది. 70 ఏళ్ల కాంగ్రెస్ కు నవతరం బీజేపీకి ఇదే తేడా అని చాటిచెప్పేసింది.

తాజాగా ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఇటీవలే బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ యువ నేత జ్యోతిరాధిత్య సింధియాకు చోటు దక్కింది. ఈ మేరకు 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇందులో 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు, రెండు స్థానాలకు మిత్రపక్షాల అభ్యర్థులకు కేటాయించారు.

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉంది. సీఎం పోస్టు ఆశించిన జ్యోతిరాదిత్య సింధియాకు కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పింది. దీంతో ఆయన తనకు మద్దతుగా ఉన్న 21మంది ఎమ్మెల్యేలతో తాజాగా తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిపోయారు. తాజాగా ఆయనను మధ్యప్రదేశ్ నుంచే రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ నామినేట్ చేయడం విశేషం.

వీరితోపాటు పలు రాష్ట్రాల నుంచి 9మంది బీజేపీ అభ్యర్థులను బీజేపీ నామినేట్ చేసింది. ఇందులో తెలుగువారికి ఎవరికి చోటు దక్కలేదు.
Tags:    

Similar News