మూడు రాజధానుల మీద ఈ నెల 15 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారు అని ప్రచారం అయితే ఒక వైపు జోరుగా సాగుతోంది. నిజానికి ఈ రోజు దాకా దీని మీద ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ మధ్య జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశం మీద చర్చ ఏదీ జరిగినట్లు లేదు. కానీ ప్రచారం మాత్రం ఒక లెక్కన ఉంది. మరి ఎందుకు అలా జరుగుతోంది అంటే ఉత్సాహంతోనే కొందరు మంత్రులు ఇతర నాయకులు చెబుతున్నారా అన్నది కూడా ఇక్కడా చూడాలని అంటున్నారు.
ఇక పార్టీ తరఫున కీలకంగా ఉన్న వారు మాత్రం న్యాయపరమైన చిక్కుల గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి మాత్రం అందరిలా విశాఖకు ఏ క్షణమైనా రాజధాని వచ్చేస్తోంది అంటూ భారీ స్టేట్మెంట్స్ ఇవ్వడంలేదు. అలాగని ఆయన విశాఖ రాజధానిని తోసిపుచ్చడంలేదు. ఆయన గతంలోనూ ఇదే చెప్పారు. తాజాగా విశాఖలో జరిపిన పర్యటనలో కూడా విశాఖకు రాజధాని వస్తుంది, అది తమ ప్రభుత్వ విధానం అంటూనే న్యాయపరమైన చికాకులు అన్నీ తొలగిపోతేనే అని ఒక కీలకమైన కండిషన్ పెడుతున్నారు.
అంటే ఆయన మాటలకు ఇక్కడ విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన పెద్ద మనిషిగా ఉంటారు. పైగా అనవసర కామెంట్స్ చేయరు, సంచలన ప్రకటనలు కూడా అసలు చేయరు. ప్రభుత్వం ముందు ఉన్న ఇబ్బందులు సాధకబాధకాలు కూడా ఆయన గమనించి వాస్తవంగానే మాట్లాడుతున్నారని అంటున్నారు.
ఆ విధంగా కనుక చూస్తే వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నదేంటి అంటే న్యాయపరంగా చిక్కులు ఉన్నాయని. అంటే హై కోర్టు ఇప్పటికే అమరావతి ఏకైక రాజధానిగా చెబుతూ తీర్పు వచ్చింది. దాన్ని కాదని ప్రభుత్వం సుప్రీం కోర్టుకి అప్పీల్ కి ఈ రోజుకీ కూడా వెళ్లలేదు. అంటే ఈ తీర్పు అమలులో ఉన్నట్లే. మరి అలాంటపుడు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుని కనుక ప్రభుత్వం ప్రవేశపెడితే కచ్చితంగా అది కోర్టు తీర్పునకు వ్యతిరేకం అవుతుంది.
ఆ విధంగా ఆలోచిస్తే కోర్టు ధిక్కరణ కూడా అవుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థగా శాసన సభ, న్యాయ వ్యవస్థ ఉన్నా కూడా కోర్టు రాజ్యాంగాన్ని చూస్తుంది. దాని ప్రకారమే తీర్పులు ఉంటాయి. అలాంటపుడు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు శాసన సభలు కానీ పార్లమెంట్ కానీ చేసినపుడు అడ్డుకునే అధికార కోర్టులకు ఉంటాయి. ఆ విధంగా అవి చట్ట సభల కంటే కొన్ని సమయాలలో ఒక మెట్టు పైనే ఉంటాయి.
అలా కోర్టులు ఇచ్చే తీర్పులను సాధారణ పౌరుడు అయినా బలమైన ప్రభుత్వమైనా కూడా తప్పక పాటించి తీరాల్సి ఉంటుంది. కాదూ కూడదు అంటే అది కోర్టుకు వ్యతిరేకమే అవుతుంది అని మేధావులు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటిదాకా కోర్టులు చెప్పిన తీర్పులు కానీ ఇచ్చిన డైరెక్షన్స్ కానీ ఏ ప్రభుత్వమైనా పాటించడమే ఈ ఏడున్నర పదుల స్వాతంత్ర దేశంలో జరిగింది. అలా కాదు మాది సర్వ స్వతంత్ర వ్యవస్థ అని ఎవరైనా శాసనసభలో కానీ వేరే చట్టసభలలో కానీ కోర్టులు కొట్టేసిన చట్టాలనే మళ్లీ తీసుకురావాలని చూస్తే ఏం జరుగుతుంది అన్నది ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు. ఎక్కడా జరగలేదు కూడా.
అపుడు ఒక విధంగా రాజ్యాంగ పరంగా కూడా ఇబ్బంది అయ్యే పరిణామాలు ఉంటాయని అంటున్నారు. ఇక మూడు రాజధానుల మీద బిల్లు విషయంలో వైసీపీ కూడా న్యాయ సలహాలు తీసుకుంటుందని అంటున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసే విషయం మీద విచారణ జరిగిన సందర్భంగా ఇటీవల ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తాము అమరావతి మీద ఇచ్చిన తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేయదలచుకున్నామని చెప్పారు. అంటే ప్రభుత్వం ఆ అలోచనలో ఉందని తెలుస్తోంది.
మరో వైపు దీని మీద సుప్రీం కోర్టులో అప్పీల్ కి వెళ్ళి స్టే కోరాలని కూడా ఆలోచిస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. అంటే అయితే హై కోర్టులో రివ్యూ లేకపోతే సుప్రీం కోర్టులో స్టే వంటి పనులు చేసి అక్కడ అనుకూలమైన తీర్పు వస్తేనే తప్ప మూడు రాజధానుల విషయంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టలేరు అని కూడా అంటున్నారు.
ఇక ఇదే అంశం మీద తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో సహనంతో ఉందని, మూడు రాజధానుల మీద చేసిన చట్టాన్ని ఉపసంహరించుకుందని కూడా గుర్తు చేశారు. కోర్టులలో ఉన్న ఈ విషయం మీద పాదయాత్ర చేసే ఉద్యమకారులు అయినా రాజకీయం చేసే వివిధ పార్టీల వారు అయినా రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదు అని ఆయన పేర్కొన్నారు.
దీన్ని బట్టి చూస్తే అన్ని రకలైన అవకాశాలను న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం క్షుణ్ణంగానే పరిశీలిస్తోందని అర్ధం అవుతోంది. అందువల్ల బయట ప్రచారం సాగుతున్నట్లుగా మూడు రాజధానుల మీద ఈ నెల 15 నుంచి మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారు అన్నది నిజమా కాదా అన్నది కూడా వేచి చూడాలని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.