వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయం ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి ఎవరు? అనే విషయం.. బీజేపీ-జనసేన నేతల మధ్య సాగుతున్న ప్రధాన చర్చ. ఎందుకంటే.. ఈ రెండు పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. ఎవరి బలం ఎంత? ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారు? ఎవరికి అనుకూలంగా ఉన్నారు? రాష్ట్ర రాజకీయాలు ఎవరికి సానుకూలంగా ఉన్నాయి? అనే విషయాలను కూడా వీరు గమనించకుండా.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అనే చర్చ చేస్తున్నారు.
బీజేపీ ఈ విషయంలో స్పష్టంగా చెబుతున్న మాట.. తామే నిర్ణయిస్తామని. ఇటీవల జాతీయ నేత.. నడ్డా ఏపీలో పర్యటించినప్పుడు.. కొందరు నాయకులు.. ఇదే విషయంపై ప్రస్తావించారు.
``ఎలాగూ.. మనం జనసేనతో పొత్తులో ఉన్నాం. సో.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్‌ను ప్రకటిస్తే.. పార్టీ ఇప్పటి నుంచి పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది`` అని వ్యాఖ్యానించారు. అయితే..ఈ విష యంపై నడ్డా సీరియస్ అయ్యారు. ఎవరి షరతులకో.. బీజేపీ లొంగిపోదన్నారు.
ఎన్నికల సమయంలోనో..త ర్వాతో.. తామే ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని కరాఖండీగా చెప్పేశా రు. ఈ పరిణామాలను గమనిస్తే.. ఒక్కశాతం ఓటు బ్యాంకు కూడా లేని.. బీజేపీ.. 7శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న జనసేన విషయంలో ఇలా వ్యవహరించడం.. జనసైనికులకు ఆవేదన మిగుల్చుతోం ది. ఇది ఒకరకంగా.. జనసేనానిని తక్కువ చేసి చూడడమే అవుతుందని.. బీజేపీ వ్యూహం కూడా అదేనని వారు గుసగుసలాడుతున్నారు.
అసలు.. పవన్ కళ్యాణ్‌ను.. ఎవరో ముఖ్యమంత్రిని చేయడం ఎందుకని.. ప్రజల్లో ఉంటే.. పవన్‌ను ప్రజలే ముఖ్యమంత్రిని చేస్తారని అంటున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం.. పవన్ మారుతారని.. వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఆయన అవతరిస్తారని.. 2019 ఎన్నికల తర్వాత.. చర్చ నడిచింది.
అయితే.. కారణాలు ఏవైనా... ఆయన మూడేళ్ల పాటు.. ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే.. ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లపాటు.. మరింతగా ఆయన ప్రజలకు చేరువ అయితే.. బీజేపీ ఆయనను సీఎం చేసేదేంటి? ప్రజలే ఆయనకు సీఎం సీటు అప్పగిస్తారని.. జనసేన నాయకులు.. కార్యకర్తలు చెబుతుండడం గమనార్హం. మరి ఈ విషయాన్ని పవన్ ఎలా చూస్తారో చూడాలి.