పక్కరాష్ట్రమైన కర్ణాటకలో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. లోక్ సభ ఎన్నికల ముందు రాష్ట్రంలో పట్టు కోసం అధికార కాంగ్రెస్-జేడీఎస్ - ప్రతిపక్ష బీజేపీల మధ్య పోరు మొదలైంది. తమ ప్రభుత్వ కూల్చివేతకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తమ పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ప్రత్యారోపణ చేస్తున్నది. ఇరుపక్షాలు ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీగా బేరసారాలు సాగిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఐదు నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండురోజులుగా జాడ లేక పోవడంతో బీజేపీ మరోసారి ఆపరేషన్ కమల్ కు తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ఎత్తుకెళ్లిందని రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నా సీఎం కుమారస్వామి నింపాదిగా ఉన్నారు. తన ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. జాడ లేకుండాపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడారని తెలిపారు.
224 స్థానాలు గల కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 80 మంది - జేడీఎస్ కు 37 మంది - బీఎస్పీకి ఒక ఎమ్మెల్యే - ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు బీజేపీ 104 స్థానాలతో విపక్షంగా వ్యవహరిస్తోంది. బీజేపీ తమ 104 మంది ఎమ్మెల్యేలను సోమవారం ఢిల్లీకి సమీపాన గుర్గావ్‌లో ఒక రిసార్ట్‌కు తరలించింది. సంక్రాంతి తరువాత కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని, దీనికి సార్వత్రిక ఎన్నికలకు సంబంధం ఉన్నదని ఒక బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మరోవైపు తమ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాడ లేక పోవడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీ నేతల మాటలతో ఆపరేషన్ కమల్ యత్నాలు జరుగుతున్నట్లు స్పష్టం కావడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది.
మాజీ ముఖ్యమంత్రి - బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప మాట్లాడుతూ అధికార కూటమికి అవసరమైన మెజారిటీ ఉన్నా.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే ఆలోచన తమకు లేదన్నారు. తమ ప్రభుత్వ కూల్చివేత యత్నం వార్తలను సీఎం కుమారస్వామి కొట్టి పారేశారు. ఆయన మైసూర్‌లో మీడియాతో మాట్లాడుతూ జాడ లేకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యక్తిగత పనిపై ముంబైకి వెళ్లామని సోమవారం ఉదయం తనతో చెప్పారని సీఎం కుమారస్వామి అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు వార్తలొచ్చాయని - అసలు ఈ వార్తలు ఎవరు బయటపెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.