ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చరిత్రలో ఓ ప్రత్యేక రికార్డు నమోదు కానుంది. అదే విపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు సాగడం. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించనున్నట్లు వైకాపా అధినేత జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోనందుకు నిరసనగా సమావేశాలను బహిష్కరించాలని వైకాపా నిర్ణయించింది. దీంతో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం - దాని మిత్రపక్షమైన బీజేపీ సభ్యులు మాత్రమే ఉన్నారు. విపక్షమైన వైకాపా సభలను బహిష్కరించడంతో ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక పరిస్థితి నెలకొంది. సమస్యలు లేవనెత్తేదీ - వాటిపై చర్చించేదీ కూడా అధికార పక్షమే కావడం గమనార్హం. అయితే అలాంటి పరిస్థితి ఉండదని...జగన్ లేని లోటును తాము భర్తీ చేస్తామని టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ వెల్లడించింది.
భారతీయ జనతాపార్టీ అనుబంధ సంఘమైన బీజేవైఎం నవ భారత యువ చైతన్య సదస్సులో పాల్గొన్న బీజేపీ శాసనసభా పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు అనంతరం మీడియాతో మాట్లాడుతూ...విపక్ష వైకాపా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం సరైనది కాదన్నారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడం ద్వారా వాటికి పరిష్కారం చూపాల్సిన రాజకీయ పార్టీ ఇటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీలో విపక్షం లేదనే అవకాశం కల్పించదలచుకోలేదన్నారు. అధికార పార్టీతో మిత్రత్వం ఉన్నప్పటికీ బీజేపీ అసెంబ్లీలో ఈ సారి విపక్ష పాత్ర పోషిస్తుందని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా వాటి పరిష్కారానికి పోరాడుతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తెలిసీ వైకాపా అధ్యక్షుడు జగన్ పాదయాత్రకు సిద్ధపడటం ద్వారా తన రాజకీయ అవగాహన రాహిత్యాన్ని చాటుకున్నారని విమర్శించారు. ప్రతి పక్ష నేతగా జగన్ విఫలయ్యారనడానికి అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయమే ఉదాహరణ అని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.
ఇలా ఉండగా విపక్షం లేకున్నా అసెంబ్లీ సమావేశాలో మనమే విపక్షం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా విపక్షం పూర్తిగా సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయించడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ఆయన పేర్కొన్నారు.