బీజేపీ మదిలో మొదటి నుంచి జమిలి ఎన్నికలు ఉన్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ఒకేసారి జరిపితే జాతీయ వాదం మీదనే పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుందని ఆ పార్టీ ఆలోచన. ఆ విధంగా జరిగితే ప్రాంతీయ పార్టీలు, వారి అజెండా అన్నీ ఈ హోరులో పడి కొట్టుకునిపోతాయని కూడా భావిస్తోంది. నిజానికి మోడీ మొదటి సారి ప్రధాని అయ్యాక ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే నాడు ఎందుకో కుదరలేదు. ఇపుడు అంటే 2023 నాటికి జమిలి ఎన్నికలను తెచ్చి భారీగా లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని టాక్.
ఈ రోజు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. బలంగా కూడా ఆ పార్టీ ఉంది. విపక్షాల మధ్య ఐక్యత అంతంతమాత్రంగా ఉంది. అందరూ మాటల వరకే చెబుతున్నారు తప్ప తీరా మోడీని ఢీ కొట్టాలీ అంటే ఎవరి సాకులు వారు వెతుక్కుంటున్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది అని భావిస్తున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలను జాతీయ అజెండాతో కొట్టాలని చూస్తోంది.
లోక్ సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే కనుక మోడీ వర్సెస్ సీఎం అన్నట్లుగా పోటీ వస్తుంది. అపుడు సహజంగా తన ప్రచారంతో బీజేపీ అగ్ర భాగాన నిలుస్తుంది అని అంటున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీజేపీకి పోటీ పెద్దగా లేనందువల్ల అది బాగా ఉపయోగపడి ప్రాంతీయ పార్టీలు దెబ్బ తింటాయని అంచనా వేస్తున్నారు. అందుకే ఒక్కో విషయాన్ని మెల్లగా సర్దుకుంటూ వస్తున్న బీజేపీ వచ్చే ఏడాది చివరిలో అంటే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కి ఆరు నెలల ముందుగా జమిలి జాతరను జరిపించి మూడవ సారి కేంద్రంలో గెలవాలని బీజేపీ చూస్తోంది అంటున్నారు.
దాంతో ఈ ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉందని అంటున్నారు. లోక్ సభలో జమిలి ఎన్నికల మీద కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల కోసం ఆచరణీయమైన రోడ్‌మ్యాప్ ను రూపొందించడానికి న్యాయ కమిషన్ కి సూచించినట్లుగా తెలిపారు.
ఆయన ఇంకో మాట కూడా అన్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా దేశంలో యాభైకి పైగా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఏడు వేల కోట్లు ఖర్చు అయినట్లుగా చెప్పారు. అదే ఒకేసారి రెండు ఎన్నికలు జరిగితే పెద్ద ఎత్తున నిధులు మిగులుతాయని కూడా అభిప్రాయపడ్డారు.
అదే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. దీని మీద పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్, భారత ఎన్నికల కమిషన్‌తో సహా వివిధ భాగస్వాములతో సంప్రదింపులు జరిపి లోక్‌సభ రాష్ట్ర శాసనసభలకు ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించిందని కేంద్రం తెలిపింది. కమిటీ తన 79వ నివేదికలో దీనికి సంబంధించి కొన్ని సిఫార్సులు చేసిందని వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే జమిలి ఎన్నికల మీద బీజేపీ పట్టుదలగా ఉందని అంటున్నారు.
ఇక జమిలి ఎన్నికలు 2023లో జరిగితే ఏపీ, తెలంగాణా, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా వంటివి తొలి దశలో ఉంటాయని అంటున్నారు. అలా రెండు దశాల్లో అన్ని రాష్ట్రాలను జమిలి చట్రంలోకి తీసుకురావడం ద్వారా 2028 నాటికి దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా చూస్తారని అంటున్నారు.