అసలే మహారాష్ట్రంలో పుంజుకోవడంపై కాంగ్రెస్ పార్టీ బోలెడన్ని ఆశలతో ఉంది. మహారాష్ట్ర లో గత లోక్ సభ ఎన్నికల్లో అయినా - ఆ తర్వాత జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ మరీ చిత్తు అయిపోలేదు. బీజేపీ- శివసేనలు పుంజుకున్నాయప్పడు. కాంగ్రెస్ కొద్దో గొప్పో తన బలాన్ని నిలుపుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన ఎన్సీపీ- కాంగ్రెస్ లు ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పుంజుకోవడంపై కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆశలు పెట్టుకుంది.
ఒకరకంగా అక్కడ హోరాహోరీ పోరు జరుగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో.. భారతీయ జనతా పార్టీ- శివసేనలకు కొత్త తలనొప్పిగా తయారయ్యాడు రాజ్ ఠాక్రే. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు సోదరుడి తనయుడు అయిన రాజ్ ఠాక్రే మొదటి నుంచి ఈ కాషాయ కూటమికి తలనొప్పిగానే ఉన్నాడు.
అయితే అతడు సొంత పార్టీ పెట్టుకుని పోరాడటం వేరు. ఇప్పుడు అతడు శివసేన-బీజేపీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. తన సొంత పార్టీ ఎంఎన్ ఎస్ ను ఎన్నికల బరిలో పెట్టుకుండా.. బీజేపీ- శివసేనలను ఓడించండి అంటూ తిరుగుతున్నాడు.
ఎంత కాదనుకున్నా రాజ్ ఠాక్రేకు కూడా కొంత అభిమాన బలగం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒకటో రెండు శాతం ఓట్లనో ఈ జూనియర్ ఠాక్రే ప్రభావితం చేయగలడేమో. ఐదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీ- సేనలకు ఇప్పుడు ఇలా రాజ్ ఠాక్రే కొత్త తలనొప్పిగా తయారై టెన్షన్ పెడుతూ ఉన్నాడు!