తాజాగా మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికలలో బీజేపీ , శివసేన తో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో మొత్తం 288 స్థానాలకు గానూ.. బీజేపీ 105, శివసేన 56 స్థానాలలో విజయఢంకా మోగించింది. మహారాష్ట్రలో ఉన్న అసెంబ్లీ స్థానాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీనితో ఎన్నికలకి ముందే ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంది శివసేన.
ఎన్నికల ముందు అమిత్ షా తమ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామని ఉద్దవ్ ఠాక్రే చెప్పారు. పొత్తు విషయం మాట్లాడుకునే సమయంలోనే బీజేపీ దీనికి అంగీకారం తెలిపింది అని చెప్పారు. ఇక ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కావడంతో వోర్లీ అసెంబ్లీ స్థానం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి 65వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎంను చేయాలని శివసేన పార్టీ బీజేపీకి ప్రతిపాదన పంపింది. బీజేపీ మాత్రం.. శివసేనకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
సీఎం పదవి ఇవ్వకపోతే మద్దతు కూడా ఉపసంహరించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి సముఖంగా లేదు అని సమాచారం. ఈ క్రమంలో శివసేన సొంత పత్రిక సామ్నా ఎన్సీపీపై ప్రశంసలు కురిపించింది. అలాగే బీజేపీ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ సంచలనం వ్యాఖ్యలు రాసింది. దీనితో తాజాగా ఈ వ్యవహారం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.