హిందుత్వం, ప్రాంతీయతత్వమే బీజేపీ బలం.. బలగం..వాటికి భంగం వాటిల్లితే ఊరుకోదన్న ప్రచారం జాతీయస్థాయిలో ఉంది... ముఖ్యంగా మత విశ్వాసాలపై గట్టిగా పోరాడిన చరిత్ర బీజేపీకి ఉందని అందరూ చెబుతారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వెంట పడుతోంది బీజేపీ.
ఇటీవలే ఆదిలాబాద్ ఆదివాసీ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఏకంగా ‘ఆర్ఆర్ఆర్’ టీంకు హెచ్చరికలు పంపారు. ఎన్టీఆర్ టీజర్ లో కొమురం భీంను ఓ మత వేషధారణలోచూపడంపై భగ్గుమన్నారు. ఇది ఆదివాసీయులను కించపరచడమేనని.. అలాంటి సన్నివేశాలను తొలగించాలని లేదంటే సినిమా తియేటర్లను తగులబెడుతామని హెచ్చరించారు.
కాగా శనివారం కొమురం భీం 80వ వర్ధంతి సందర్భంగా ఇదే బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడెఘాట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజనులు భారీగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో బాబూరావ్ ఆవేశంగా మాట్లాడారు. మరోసారి ఆర్ఆర్ఆర్ టీంకు వార్నింగ్ ఇచ్చారు.
‘ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో కొమురం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సినిమా ట్రైలర్‌లో భీమ్ వేషాధారణలో ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపి పెట్టుకోవడం ఆదివాసీయులను కించపర్చడమేనని, అలాంటి సన్నివేశాలను తొలగించాలని, లేదంటే సినిమా థియేటర్లు తగలబెడుతామని’ సోయం బాబూరావు మరోసారి హెచ్చరించారు.
కొమురం భీం పుట్టిన గడ్డ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ వరుసగా మూడోసారి ఆర్ఆర్ఆర్ టీంపై విమర్శలు గుప్పించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోమంటూ ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదంతా చూస్తుంటే విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ మూవీని బీజేపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు కథ ఏంటి? అందులో కొమురం భీం ఆ వేశంలో ఎందుకు కనిపించాడు? అసలు అది పాజిటివ్ కోణమా? నెగెటివ్ కోణమా అన్నది తెలుసుకోకుండా బీజేపీ చేస్తున్న రచ్చపై పలువురు సినీ క్రిటిక్స్ తప్పుపడుతున్నారు. కొమురం భీంను హీరోగా చూపిస్తున్న ఈ మూవీలోని సారాన్ని తెలుసుకోవాలని.. అదే సమయంలో ఇది కల్పిత కథ అన్న రాజమౌళి మాటలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ఇక రాజమౌళికి కూడా చరిత్రకు సంబంధించిన సున్నితమైన అంశాల్లో జాగ్రత్త వహించాలని పలువురు సూచిస్తున్నారు.