కేరళ రాష్ట్రంలోని ఒక స్థానిక సంస్థకు జరిగిన ఎన్నికలో వచ్చిన ఫలితం జాతీయ వార్తాంశంగా మారింది. ఎందుకలా? అన్న ఇష్యూలోకి వెళితే.. అంతకు ముందు చోటు చేసుకున్న వివాదమే కారణంగా చెప్పాలి. ‘పందళం’ పేరు విన్నంతనే మామూలు వారికి పెద్దగా అనిపించదు కానీ.. అయ్యప్ప భక్తులకు.. శబరిమలకు తరచూ వెళ్లే యాత్రికులందరికి ఈ పేరు సుపరిచితం. ఎందుకంటే.. అయ్యప్పస్వామి ఆలయం ఉన్నది పందళం మున్సిపాలిటీ పరిధిలోకే వస్తుంది. దీని పరిధిలోనే పందళం రాజ కుటుంబం కూడా నివాసం ఉంటుంది. అయ్యప్ప స్వామి దేవాలయం ఉన్న శబరిలమలకు పది నుంచి యాబై ఏళ్ల లోపు మహిళలకు ప్రవేశం ఉండని విషయం తెలిసిందే.
ఈ విషయంపై సవాలు విసురుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వయసులతో సంబంధం లేకుండా శబరిమల ఆలయానికి మహిళల ప్రవేశానికి అనుమతించారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానికులు సైతం సుప్రీం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే.. దీనిపై స్థానికంగా అధికారంలో ఉన్న ఎల్ డీఎఫ్ (కమ్యునిస్టులు) పార్టీ మాత్రం వారి మనోభావాల్ని పట్టించుకోలేదు. పైగా ఆలయంలోకి వెళ్లే వారికి మద్దతుగా నిలిచారు. దీంతో అక్కడి వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వందల ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పక్కన పెట్టేసే చర్యను తప్పుపట్టారు. తీవ్రంగా వ్యతిరేకించారు.ప్రజల మనోభావాలకు తగ్గట్లు పందళం రాజవంశీకులు ప్రజల పక్షాన నిలిచారు.
కట్ చేస్తే.. ఈ నెల 8 నుంచి 14 మధ్యన కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా పందళం ప్రజానీకం అధికార ఎల్ డీఎఫ్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు. గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని సొంతం చేసుకున్న ఆ పార్టీ.. తాజా ఎన్నికల్లో కేవలం సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమైంది. పందళం మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉంటే 17 వార్డుల్లో ఎన్డీయే కూటమి 17స్థానాల్లో విజయం సాధిస్తే.. ఇంతకాలం అధికారంలో ఉన్న ఎల్ డీఎఫ్ కు కేవలం 7 వార్డుల్లోనే విజయం సాధించింది. ఇక.. యూడీఎఫ్ ఐదు వార్డుల్లో గెలిచింది. మరోస్థానంలో ఇతరులు విజయం సాధించారు. శబరిమల ఆలయం విషయంలో స్థానిక అధికారపక్షం అనుసరించిన వైనమే ఎన్నికల్లో ఓటమికి కారణమని.. ఈ విషయంలో అక్కడి వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకున్న బీజేపీకి పట్టంకట్టినట్లుగా చెబుతున్నారు.