రామ్‌ మాధ‌వ్‌ కు షాక్‌..న‌మ్మిన‌బంటు గుడ్‌ బై

Update: 2018-06-19 06:35 GMT
బీజేపీ శ్రేణుల‌కు మింగుప‌డ‌ని వార్త. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఫ్యాన్స్‌..ప్ర‌ధానంగా తెలుగు రాష్ర్టాల్లోని బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేని ప‌రిణామం. ప్ర‌ధాన‌మంత్రి మోడీ తీరు న‌చ్చక బీజేపీ ప్ర‌చార బృందంలోని కీల‌క‌వ్య‌క్తి త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్ప‌శారు. దీనికి తెలుగు రాష్ర్టాల‌కు సంబంధం ఏంటంటే..ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ప్రచార బృందంలో పనిచేసిన కీలక వ్యక్తి 'శివం శంకర్‌ సింగ్‌'పై మాటలు చెప్పారు. బీజేపీ జాతీయ కార్యదర్శి 'రామ్‌ మాధవ్‌' ప్రచార బృందంలో శివం శంకర్‌ సింగ్‌ ప్రముఖ పాత్ర పోషించారు. 'బీజేపీకి రాజీనామా చేస్తున్నా'నంటూ తాజాగా ఆయన జాతీయ మీడియాతో వ్యక్తం చేసిన అభిప్రాయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

2014 పార్లమెంటు ఎన్నికలకు ముందు మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభావంతమైన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని అమలుజేసిందని,  ఈ వ్యూహంలో తాను కూడా పడిపోయాన‌ని శంక‌ర్ సింగ్ తెలిపారు. నాలుగేండ్ల మోడీ పాలన చూశాక నేను చేసింది పొరపాటేనన్న సంగతి అర్థమైందన్నారు. `2013లో నరేంద్రమోడీ చెప్పిన అభివృద్ధి మంత్రాన్ని నమ్మాను. భారతదేశ రాజకీయాల్లో ఆయన నాకు ఒక ఆశాకిరణంలాగా కనపడ్డారు. కానీ ఇప్పుడు మోడీపై, బీజేపీపై ఆ నమ్మకం పోయింది. ఈ నాలుగేళ్ల‌ మోడీ పాలనలో మంచికన్నా, చెడే ఎక్కువగా ఉంది. ప్రచార వ్యూహాలతో మోడీ సర్కార్‌ ప్రజల్ని మభ్యపెడుతోంది. ప్రజలు గుడ్డిగా విశ్వసించే విధంగా ఎన్నికల ప్రచార వ్యూహాలు అమలవుతున్నాయి. దీని నుంచి దేశ ప్రజలు బయటపడాలి. లేదంటే భారతదేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం.` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  

``నోట్ల రద్దు పెద్ద వైఫల్యమని తెలిసినా...దానిని బీజేపీ ఒప్పుకోవటం లేదు. నల్లధనం - అవినీతి అరికట్టడానికని చెప్పిన మాటలన్నీ మోసం. దేశ ఆర్థిక రంగాన్నే నోట్లరద్దు కుదేలు చేసింది. ఆదరాబాదరాగా 'జీఎస్టీ'ని అమల్లోకి తెచ్చారు. అత్యంత సంక్లిష్టమైన అంశాల్ని ఇందులో పొందుపర్చారు. వివిధ రకాలకు వస్తువులకు వివిధ రకాల స్లాబులు. పన్ను రిటర్న్‌ ఫైలింగ్‌ అంతా గందరగోళం.`` అంటూ కీల‌క అంశాల‌ను వివ‌రించారు. ``సీబీఐ - ఈడీలను ఎంత దుర్వినియోగం చేయాలో...అంత చేశారు. నాకు తెలిసినంతవరకు సీబీఐ, ఈడీలను ఈస్థాయిలో రాజకీయ లక్ష్యాలకోసం వాడటాన్ని చూడలేదు. మోడీ - అమిత్‌ షాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు సీబీఐ - ఈడీ దాడులు జరిగిపోతాయి. రాజకీయ వ్యతిరేక గళాన్ని చంపేయడానికి ఇది చాలు. ప్రజాస్వామ్య మౌళిక లక్షణానికే ఇది ప్రమాదకరం. జస్టిస్‌ లోయా మృతి కేసు - కైలిఖో పాల్‌ ఆత్మహత్య - సోహ్రబుద్దీన్‌ ఎన్‌ కౌంటర్‌ కేసు, ఉన్నావో...తదితర ఘటనల్లో నిష్పాక్షిక విచారణ జరగలేదు. నిజాలు బయటకు రాలేదు. ``అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.


Tags:    

Similar News