18 నెలల చిన్నారిలో బ్లాక్ ఫంగస్ ... అరుదైన చికిత్స తో విముక్తి !

Update: 2021-06-04 04:30 GMT
మనదేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న రోగులకే ఇది సోకుతుందని ఇన్ని రోజులు భావిస్తూ వచ్చాం. కానీ, ఇప్పుడు కల్లాకపటం తెలియని, ఏ వ్యాధి కూడా సోకని శిశువుల్లో కూడా ఇది కనబడడం డాక్టర్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ లో 18 నెలల చిన్నారితో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడ్డాయి. అయితే , వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఆ బాలుడిని బ్లాక్ ఫంగస్ నుండి కాపాడారు. ఆ అరుదైన శస్త్రచికిత్స ను కాకినాడ జిజిహెచ్ వైద్యులు చేసారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. పెనుగొండ కి చెందిన 18 నెలల బాలుడికి బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ అవ్వడంతో గత నెల 28 న జిజిహెచ్  లో చేరాడు. తాజాగా అతడికి అరుదైన శస్త్రచికిత్స ను చేసి ఆ బాలుడి ప్రాణాలు నిలిపారు. పది మంది పిడియాట్రిక్ వైద్యుల బృందం మూడున్నర గంటల పాటు శ్రమించి ఎడమ పక్క ముక్కు , ఎడమ కన్ను లో నుండి ఊపిరితిత్తుల వరకు వ్యాపించిన ఫంగస్ ను చాలా కష్టపడి తొలగించారుఆపరేషన్ తర్వాత ఆ బాలుడి ఆరోగ్యం బాగుంది అని తెలిపారు. మ్యుకోర్ మైసిటీస్ గా వ్యవహరిస్తున్న ఈ ఫంగస్ మొదట ముక్కును, ఆ తరువాత కళ్ళు తదితర భాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చివరకు ఊపిరి తిత్తులకు కూడా ఇది సోకుతుందని అంటున్నారు. సాధారణంగా తలనొప్పి, ముఖం ఉబ్బడం, ముక్కు మూసుకుపోవడం, జ్వరం వంటివి ఈ బ్లాక్ ఫంగస్ లో కనిపిస్తాయని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. కోవిద్ నుంచి కోలుకున్నవారు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినందున ఇది సోకుతుందన్నారు. 90 నుంచి 95 శాతం డయాబెటిస్ రోగులు దీనికి త్వరగా గురయ్యే అవకాశం ఉందన్నారు. అయితే డయాబెటిక్ కానివారిలో కూడా ఇది కనబడుతుందని, కానీ ఇవి అరుదైన కేసులని ఆయన చెప్పారు.
Tags:    

Similar News