ఒక వైపు కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, మరో వైపు బ్లాక్ ఫంగస్ విలయతాండవం కొనసాగుతోంది. గత ఏడాది కాలంగా కరోనాతో ఇబ్బందులు పడుతూ దాని నుంచి పూర్తిగా బయటపడక ముందే సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండగా, కరోనా వైరస్ కు తోడు బ్లాక్ ఫంగస్ వచ్చి చేరడంతో భయాందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వైరస్ తో పాటు బ్లాక్ ఫంగస్ అంటేనే జనాలు జంకుతున్నారు. ఇక హర్యానా రాష్ట్రంలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి.
ఆ రాష్ట్రంలో తాజాగా నిన్న 133 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 18 మంది బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య 756కు చేరింది. వీరిలో 648 మంది బాధితులు వివిధ వైద్య కళాశాలల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు వ్యాధి నుంచి 58 మంది బాధితులు కోలుకున్నారు. ఇదిలా ఉండగా, హర్యానాలో కరోనా వ్యాక్సిన్ తో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రానికి 66 లక్షల కరోనా వ్యాక్సిన్లకు ఆర్డర్ చేయగా, అందులో ఐదో వంతు మాత్రమే వచ్చాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్లు, బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతను తీర్చడానికి ప్రభుత్వం గ్లోబల్ టెండర్ ను ఆహ్వానించింది. కరోనా వ్యాక్సిన్ కోటి డోసులు, 15 వేల బ్లాక్ ఫంగస్ కోసం టెండర్ జారీ చేసింది ప్రభుత్వం.