కరోనా మహమ్మారి రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా లక్షల కేసులు నమోదవుతున్నాయి. వేలమంది వైరస్ కాటుకు బలవుతున్నారు. ఓవైపు కొవిడ్ విజృంభిస్తుండగా... మరోవైపు బ్లాక్ ఫంగస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్ పట్ల ప్రజలకు ఇటీవల భయాందోళనలు పెరిగాయి. ఈ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలువురు ఈ ఇన్ఫెక్షన్ తో మృతి చెందారు. మరో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
మధ్యప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఇండోర్ లోని మహారాజ యశ్వంత్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఆ ఆస్పత్రిలో ఇప్పటివరకు 67 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఇండోర్ లో ఇతర ఆస్పత్రుల్లోనూ ఈ బాధితులు ఉన్నట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.
ఓ వైపు కరోనా, మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చికిత్స పేరిట కార్పొరేట్ ఆస్పత్రులు బాధితుల రక్తం పీల్చుతున్నాయి. మహమ్మారితో కొందరి జీవితాలు దర్భరం అవుతుండగా... ఫీజుల రూపంలో చెల్లించకలేక మరికొన్ని జీవితాలు చితికిపోతున్నాయి. దేశంలో ఈ ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎప్పుడు కుదుటపడుతాయోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్నాళ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.