స్టెరాయిడ్స్ వాడకున్నా బ్లాక్ ఫంగస్ ముప్పు..!

Update: 2021-05-24 04:30 GMT
కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కలవరపెడుతోంది. ఏడాది కాలంలో వైరస్ విజృంభిస్తుండగా ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ భయంకరమైన వ్యాధితో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొవిడ్ చికిత్సలో ఉపయోగించే స్టెరాయిడ్స్ వల్ల మ్యూకోమైకోసిస్ వృద్ధి చెందుతోందని పలువురు వైద్య నిపుణులు అంచనా వేశారు. ఈ భయంకరమైన వ్యాధి వ్యాప్తి చెందడానికి ఇతర కారణాలపై పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు.

స్టెరాయిడ్స్ ఉపయోగించని కొవిడ్ బాధితుల్లోనూ బ్లాక్ ఫంగస్ నిర్ధారించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల కరోనా బారిన పడిన ఇద్దరు వ్యక్తులు హోం ఐసోలేషన్ లో కోలుకున్నారని ఓ వైద్యుడు తెలిపారు. అతడు ఎటువంటి స్టెరాయిడ్స్, కృత్రిమ ఆక్సిజన్ తీసుకోలేదని స్పష్టం చేశారు. అయినా వారు కరోనా నుంచి కోలుకున్న కొన్ని రోజులకు బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లుగా వెల్లడించారు. కాబట్టి కేవలం స్టెరాయిడ్స్ వల్లనే బ్లాక్ ఫంగస్ వ్యాపించదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కొవిడ్ సోకిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు. కాబట్టి వాడిన మాస్క్ మళ్లీ మళ్లీ ధరించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కాటన్ మాస్క్, ఎన్95 మాస్క్ ఏదైనా సరే శ్వాసలోని తేమతో తడిసిపోతుందని అంటున్నారు. ఆ తేమ మనకు తెలియదని చెబుతున్నారు. అలా రోజుల తరబడి మాస్కులు వాడితే ఫంగస్ వృద్ధి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మాస్కును రోజుల తరబడి వాడకుండా మార్చాలని చెబుతున్నారు. మాస్కును శుభ్రం చేయాలని లేదా ఎండ వేడిమిలో ఉంచాలని అంటున్నారు. అలా చేస్తే ఫంగస్ పెరిగే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి మాస్కు విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కచ్చితంగా ఉతికిన లేదా డెటాల్ లో ఉంచిన మాస్కునే వాడాలని హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు మాస్కు పట్ల జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు కరోనా సోకి వెంటిలేటర్లపై చికిత్స పొందిన వారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. స్టెరాయిడ్లు, కృత్రిమ ఆక్సిజన్ ద్వారా కోలుకున్నవారికి ఈ సమస్యలు ఉండే ఆరు వారాల పాటు జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. వారికి ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలని చెబుతున్నారు.
Tags:    

Similar News