కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న సందర్భంలో కొందరి ఆలోచనలు విపరీత పోకడలకు పోతున్నాయి. ఓ వైపు కోవిడ్ కలకలం ఉంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ భయం వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజలను బ్లాక్ ఫంగస్ భయం వెంటాడుతోంది. స్టెరాయిడ్స్ అధికంగా ఉపయోగించి కోలుకున్న కరోనా రోగులతో పాటు మధుమేహం నియంత్రణ లో లేకపోవటం కూడా ఈ కేసుల పెరుగదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గతంలో వీటికి సంబంధించి ఏడాది కాలంలో నమోదయ్యే కేసులు ఇటీవల కేవలం 10 రోజుల వ్యవధిలో వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇదే మంచి చాన్స్ అనుకొని కొందరు ఓ రేంజ్‌లో డబ్బులు దోచుకుంటున్నారని సమాచారం.
బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకు ఎంపోటెరిసిన్-బి ఇంజక్షన్ 300 ఎమ్‌జి రోజుకు ఒకటి చొప్పున రెండు వారాలపాటు ఇవ్వాలి. అప్పటికీ తగ్గకపోతే మరికొన్ని రోజులు కొనసాగించాలి. అప్పుడే ఫంగస్ నియంత్రణలోకి వస్తోంది. లేకుంటే రోజుల వ్యవధిలోనే దాని ప్రభావం కళ్ల నుంచి బ్రెయిన్‌కు పాకుతోంది. ఆ తరువాత ప్రాణాల మీదుకు వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక కరోనా నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో రెమిడిసివర్ కోసం కరోనా బాధితులు పరుగులు తీశారు. తాజాగా బ్లాక్ ఫంగస్ వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పుడు ఎంపోటెరిసిన్-బి ఇంజక్షన్ కోసం పరుగులు పెడుతున్నారు. అయితే, ఇక్కడే మోసగాళ్ల దందా జరుగుతోంది.
ఎంపోటెరిసిన్-బి ఇంజక్షన్ 300 ఎమ్‌జి సహా బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు, మందులను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు సకాలంలో సరిపడా ఇంజక్షన్లు, మందులు రాకపోవడంతో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. అయితే, సదరు ఇంజక్షన్ల ద్వారానే బ్లాక్ ఫంగస్ బారి నుంచి రక్షించుకోగలమన్న నమ్మకంతో చాలామంది బ్లాక్ మార్కెట్‌లో రూ.40 వేలు వరకూ పెట్టి కొంటున్నారు. వాస్తవానికి ఈ ఇంజక్షన్ ధర రూ.5 వేలు ఉంటుంది. కానీ బ్లాక్ మార్కెటర్లు , దోపిడీ ముఠాలతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి.