ఇటీవలి కాలంలో మరోమారు దుర్వార్తలను వింటున్న భారత ఐటీ రంగంఅలాంటి వార్తనే వినాల్సి వచ్చింది. అమెరికాలో హెచ్1బీ వీసా పొందిన వారి జీవిత భాగస్వాములకు ఇచ్చిన వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తుందనే షాక్ వార్త నుంచి తేరుకోవడానికి ముందే...భారత ఐటీ కంపెనీలు పొందిన హెచ్ 1బీ వీసాల సంఖ్య రెండేళ్ళలో సగానికి పడిపోయాయనే నివేదిక విడుదల అయింది. 2015లో భారత్ కు చెందిన టాప్ 7 కంపెనీలు 14,792 హెచ్1బీ వీసాలు పొందగా.. 2017లో 8,468కి అంటే 43 శాతం పడిపోయాయని ద నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకటించింది.
తమ అవసరం కోసం అత్యంత నైపుణ్యత కలిగిన విదేశీయులను చేర్చుకొనే అమెరికన్ కంపెనీలు వారికి హెచ్1బీ వీసాలను జారీ చేస్తాయి. వీరిలో అత్యధికులు భారతీయులే ఉన్నారు. అయితే మనవాళ్లకు వీసాలు భారీ స్థాయిలో పడిపోయేందుకు గల కారణాలను వివరిస్తూ ఐటీ పరిశ్రమలో వస్తున్న కొత్త టెక్నాలజీల కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని ద నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విదేశీ ఉద్యోగులపై ఆధారపడే పరిస్థితి తగ్గిందని ఈ ఫౌండేషన్ పేర్కొంది. అమెరికా ప్రభుత్వ విధానాల కారణంగా హెచ్1బీ వీసాల జారీ తగ్గిందని ఐటీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఇటీవల పెరిగిందని, దీంతో విదేశీయులకు వీసాల జారీ తగ్గిందని ఫౌండేషన్ అభిప్రాయపడింది. 2016తో పోలిస్తే 2017 టీసీఎస్ - టెక్ మహీంద్రాలు ఎక్కువ వీసాలు పొందగా.. ఇన్ఫోసిస్ - విప్రో - హెచ్ సీఎల్ అమెరికా - ఎల్ అండ్ టీ - మైండ్ ట్రీ కంపెనీల వీసాలు తగ్గాయి.