సుజయ కృష్ణ రంగారావు గుర్తున్నారా? విజయనగరం జిల్లా బొబ్బిలి రాజుల కుటుంబానికి చెందిన సుజయ్ .. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు, రాజకీయాలతో నిన్న మొన్నటి వరకు హవా చలాయించారు. అయి తే.. ఎంతగా దూకుడు చూపించినా.. వరుస విజయాలు దక్కించుకున్నా.. ఒకే ఒక్క రాంగ్ స్టెప్ ఆయనను జీరోగా మార్చేసింది. ప్రస్తుతం ఈ యన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. సెమి రిటైర్మెంట్ స్టేజ్‌లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు అస్తమిస్తున్న సూర్యుడి లెక్క ఉంది ఆయన పరిస్థితి.
సుజయ్ రాజకీయ ప్రస్తానం.. కాంగ్రెస్‌తో ప్రారంభమైంది. బొబ్బిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై రెండు సార్లు విజయం సాధించారు. ఆ క్రమంలోనే వైఎస్ జగన్‌కు చేరువై.. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మారా రు. ఆ తర్వాత 2014లో వైసీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలో సుజయ్‌కు జగన్ చాలా ప్రాధాన్యం ఇచ్చారు. బొబ్బిలిలో వైసీపీ రాజకీయాలను చక్కబెట్టే బాధ్యతను సుజయ్‌కే అప్పగించారు. అయితే.. వైసీపీ అధికారంలోకి రాకపోవడం.. టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే పథకం ప్రారంభించడంతో సుజయ్ సైకిల్ ఎక్కేశారు.
ఈక్రమంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సుజయ్‌కు గనుల శాఖను అప్పగించి మంత్రిని చేసింది. ఇక, 2019 ఎన్నికలసమయంలో టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన సుజయ్.. ఘోరంగా ఓడిపోయారు. నిజానికి బొబ్బిలి ప్రజలే సుజయ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎన్నికలకు ముందు.. సర్వేల్లో స్పష్టమైంది. ఇక, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరోవైపు... ఏ పార్టీ అధినేత వలలో చిక్కుకున్నారో.. ఇప్పుడు అదే పార్టీ తీవ్రమైన చిక్కుల్లో ఉంది. దీంతో రంగారావు.. మౌనంగా ఉన్నారు. పార్టీని కూడా పట్టించుకోవడం లేదు.
దీంతో, రంగారావు సోదరుడు బేబినాయనకు చంద్రబాబుప్రాధాన్యం పెంచారు. ఆయనకు బొబ్బిలి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామంపై సుజయ్ లో ఎలాంటి రియాక్షన్ లేక పోవడం గమనార్హం. దీంతో ఇక, ఆయన సెమీ రిటైర్మెంట్ మోడ్‌లో ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల వరకు కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందా? లేక మధ్యలో ఏమైనా మారతారా? అనేది చూడాలి.