అస‌హ‌నం అన్న వారికి వ్య‌తిరేకంగా బాలీవుడ్!

Update: 2015-11-04 16:25 GMT
ఇంత‌కాలం నాణెనికి ఒక‌వైపు మాత్ర‌మే త‌న వాద‌న‌ను వినిపిస్తుంటే.. తాజాగా అందుకు భిన్న‌మైన వాద‌న తెర‌పైకి వ‌స్తోంది. దేశంలో అస‌హ‌నం తీవ్ర‌స్థాయిలో పెరిగిపోతుందంటూ భారీగా ఆందోళ‌న‌లు చేయ‌టం.. ప్ర‌భుత్వాలు ఇచ్చిన పుర‌స్కారాల్ని వెన‌క్కి ఇచ్చేయ‌టం లాంటివి ఈ మ‌ధ్యన పెరిగిపోతున్న ప‌రిస్థితి. దీనిపై ప‌లువురు ప్ర‌ముఖులు మద్ద‌తుగా మాట్లాడుతున్న‌ది తెలిసిందే.

దీనికి భిన్న‌మైన ప‌రిణామం ఒక‌టి తాజాగా తెర‌పైకి వ‌చ్చింది. దేశంలో అస‌హ‌నం పెరిగిపోతుంద‌ని ఆరోపిస్తూ పుర‌స్కారాలు తిరిగి ఇచ్చేస్తున్న వారికి వ్య‌తిరేకంగా బాలీవుడ్ ప్ర‌ముఖులు ర్యాలీ నిర్వ‌హించాల‌ని డిసైడ్ చేశారు. ఇందుకుగాను న‌వంబ‌రు 7న రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కూ ర్యాలీగా వెళ్లాల‌ని డిసైడ్ చేశారు.

దేశంలో ఆందోళ‌న ప‌డేంత స్థాయిలో అస‌హ‌న ప‌రిస్థితులు లేవంటూ అనుప‌మ్ ఖేర్‌.. మ‌ధుర్ భండార్క‌ర్‌.. ర‌వీనాటాండ‌న్ లాంటి వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అవార్డుల‌ను తిరిగి ఇచ్చేయ‌టం స‌ద‌రు సంస్థ‌ల్ని అవ‌మానించ‌ట‌మేన‌ని వ్యాఖ్యానిస్తున్న వారు.. అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న వారు చెబుతున్న కార‌ణాలు వింటే న‌వ్వు వ‌స్తోంద‌ని చెప్ప‌టం విశేషం.

త‌మ‌కిచ్చిన పుర‌స్కారాల్ని తిరిగి ఇచ్చేస్తున్న వారు.. దేశంలో ఇంత‌కు మించి అస‌హ‌నం ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో పుర‌స్కారాలు ఎందుకు తిరిగి ఇవ్వ‌లేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అస‌హ‌నం మీద ర్యాలీ జ‌రిగిన దానికి భిన్నంగా.. అస‌హ‌నం అంటూ లేదంటూ ర్యాలీ నిర్వ‌హించాల‌న్న అంశంపై బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులు ఢిల్లీలో ర్యాలీ చేయ‌టం స‌రికొత్త ప‌రిణామంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News