చిన్నపిల్లల బుగ్గలు గిల్లుతున్నారా?.. బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే!
ఇటీవల కాలంలో అత్యాచారాల కేసులను విచారిస్తున్న పలు రాష్ట్రాల హైకోర్టులు.. ఇస్తున్న తీర్పులు .. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు.. చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి కేసులోనే బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ అత్యాచార యత్నం కేసులో బాంబే హైకోర్టు.. ఆస్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది. చిన్నపిల్లల బుగ్గలు గిల్లడం నేరమా? అనే విషయంలో ఓ కేసుకు సంబంధించి బాం బే హైకోర్టు స్పష్టత ఇచ్చింది.
లైంగిక ఉద్దేశం(సెక్స్ చేయాలని లేకపోవడం) లేకుండా చిన్నపిల్లల చెంపలు తాకడం నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు తెలిపింది. జస్టిస్ సందీప్ శిందేతో కూడిన ఏక సభ్య ధర్మాసనం అత్యాచార యత్నం చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన నిందితుడి కి బెయిల్ మంజూరు చేసింది. ``నా అభిప్రాయంలో లైంగిక ఉద్దేశం లేకుండా చెంపలు తాకడం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాదు. పోక్సో చట్టంలోని సెక్షన్ 7లో ఇదే ఉంది. నిందితుడు లైంగిక ఉద్దేశంతోనే చిన్నారి చెంపను తాకినట్లు రికార్డులోని ప్రాథమిక మూల్యంకనం సూచించడం లేదు" అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
అయితే తన పరిశీలనలు బెయిల్ పిటిషన్ల విచారణకు మాత్రమే వర్తిస్తాయని జస్టిస్ సందీప్ శిందే స్పష్టం చేశారు. ఇతర కేసుల విచారణను ఇది ఏమాత్రం ప్రభావితం చేయదని పేర్కొన్నారు మొత్తంగా చూస్తే.. ఇటీవల కాలంలో.. ఆచ్ఛాదన ఉన్నప్పుడు.. మహిళ శరీరాన్ని తాకినా తప్పులేదని.. ఆమెకు ఇష్టం లేకున్నా శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదని.. హైకోర్టులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో తాజా తీర్పు మరో చర్చకు దారితీసింది.
ఇంతకీ ఏం జరిగింది?
ముంబైలో మాంసం దుకాణం నడిపే 46 ఏళ్ల ఉల్లా.. 2020 జులైలో ఓ ఎనిమిదేళ్ల చిన్నారిని తన షాపులోకి తీసుకెళ్లి బుగ్గలు గిల్లాడు. అనంతరం తన చొక్కా విప్పి బాలికపై అఘాయిత్యం చేయబోయాడు. అయితే చిన్నారిని ఇల్లా దుకాణంలోకి తీసుకెళ్లడం గమనించిన ఓ మహిళ అనుమానంతో అక్కడికి వెళ్లింది. అప్పు డే నిందితుడు తన ప్యాంటు విప్పబోతున్నాడు. వెంటనే ఆ మహిళ చిన్నారిని అక్కడి నుంచి తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని నవీ ముంబయిలోని తలోజా జైల్లో ఉంచారు. ఇప్పుడు బాంబే హైకోర్టు తీర్పుతో ఉల్లాకు బెయిల్ లభించింది.