ఏపీ ప్రత్యేక హోదా అంశం ఏపీ అధికారపక్షానికి.. దాని మిత్రపక్షమైన బీజేపీ మధ్య దూరం పెంచుతుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఏపీ అధికారపక్షంపై అప్పుడప్పుడు విమర్శలు చేసే కమలనాథులు.. తాజా పరిస్థితుల్లో గమ్మున ఉండిపోతుండగా.. అందుకు భిన్నంగా ఎప్పుడూ నోరు జారని తెలుగు తమ్ముళ్లు మాత్రం చెలరేగిపోతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నకొందరు తెలుగుదేశం నేతలు బీజేపీ నేతలపై విమర్శలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
తాజాగా విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వినూత్న రీతిలో నిరసన తెలిపి బీజేపీ నేతలకు షాకిచ్చారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించిన ఆయన.. చెవిలో పువ్వలు పెట్టుకొని.. కార్లు.. బైకులు తుడుస్తూ నిరసన తెలిపారు. మిత్రపక్షంగా ఉంటూ తమకు చేస్తున్న అన్యాయంపై ఆయన తన ఆగ్రహాన్ని తాజా నిరసనతో వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బొండా పోలవరం ప్రాజెక్టుకు రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చారని.. హోదా హామీ నెరవేరుస్తారన్న ఉద్దేశంతో రెండేళ్ల నుంచి ఎదురుచూశామని.. అయినా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. రెండేళ్లు వెయిట్ చేయటం చాలా ఎక్కువ టైంగా చెప్పిన బొండా.. ఏపీ ప్రజలు ఇంతకు మించి సహనంతో చూసే అవకాశం లేదన్న మాటను చెప్పేశారు. ఏపీ ప్రజల సహనం సంగతి తర్వాత.. హోదా ఇష్యూలో మిత్రపక్షం వైఖరి పట్ల తనలో సహనం మాత్రం మిస్ అయ్యిందన్న విషయాన్ని బొండా తన చేతలతో తేల్చేశారని చెప్పాలి. బొండాను స్ఫూర్తిగా తీసుకొని తెలుగు తమ్ముళ్లు కానీ రోడ్ల మీదకు వచ్చి బీజేపీ మీద నిరసనలకు దిగితే ఏపీ బీజేపీ నేతలకు తీవ్ర ఇబ్బందులు ఎదురు కావటం ఖాయం.