గార్డెన్ సిటీగా.. భారత్ ఐటీ ఇండస్ట్రీకి సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరులోని ఒక కంపనీలో చోటు చేసుకున్న దుర్మార్గం షాకింగ్ గా మారింది. తన దగ్గర పని చేస్తున్న మహిళా ఉద్యోగిని వేధించటంతో పాటు.. ఆమెను లొంగదీసుకోవటంలో భాగంగా బాస్ దుర్మార్గానికి పాల్పడ్డాడు. 22 ఏళ్ల ఐటీ ఉద్యోగినిపై కన్నేసిన అతగాడు.. ఆమెపై ఉచ్చు విసిరాడు. అదృష్టవశాత్తు ఆమె అలెర్ట్ గా ఉండటంతో ఈ బాస్ మాయలాడి మాయలు పారలేదు.
తలనొప్పిగా ఉందని.. ట్యాబ్లెట్ తెచ్చుకునేందుకు తనకు పర్మిషన్ ఇవ్వాలని కోరిన సదరు మహిళా ఉద్యోగినిపై.. మల్లప్ప అనే 38 ఏళ్ల బాస్.. వయాగ్రా ట్యాబ్లెట్ ను ఇచ్చాడు. అయితే.. తనకిచ్చింది తలనొప్పి మాత్ర కాదని.. వయాగ్రా అన్న విషయాన్ని గుర్తించిన సదరు ఉద్యోగిని ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో తన పట్ల పలు సందర్భాల్లో అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని సదరు ఉద్యోగిని తన ఫిర్యాదులో పేర్కొనటంతో తాజా వ్యవహారం బయటకు వచ్చింది. అనుక్షణం అప్రమత్తంగా ఉండటం ఎంత అవసరమన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పొచ్చు.