విశాఖ నే ముద్దు అంటున్న బొత్స !

Update: 2020-01-06 05:30 GMT
ప్రస్తుతం రాష్ట్రం రాజధాని అంశం పై రగిలి పోతుంది. విశాఖ వద్దు ..అమరావతి నే ముద్దు అంటూ రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు , ధర్నాలు చేస్తున్నారు. ఇక దీనిపై నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా రెస్పాండ్ అవుతున్నారు. తాజాగా విశాఖలో రాజధాని అంశం పై మంత్రి బొత్స తనదైన శైలి లో స్పందించారు. అలాగే విశాఖ లో రాజధాని వద్దు అంటున్న బాబుకి దిమ్మతిరిగేలా మాట్లాడారు. ఎవరు అవున్నన్నా కాదన్నా విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ. ఒక్క సారైన వైజాగ్ చుట్టి రావాలని పర్యాటక ప్రియులు చాల ఆరాటపడుతుంటారు అని చెప్పారు.

అటువంటి విశాఖ గురించి చంద్రబాబుకూ తెలుసు. అయితే రాజధాని అని పేరు పెట్టడానికి ఆయనకు మనసొప్పలేదు కానీ, జాతీయ అంతర్జాతీయ సదస్సులన్నీ కూడా విశాఖ లోనే నిర్వహించారు. అంతెందుకు తొలి క్యాబినెట్ మీటింగు కూడా బాబోరు విశాఖలోనే పెట్టారు. ఇపుడు జగన్ వైజాగ్ అంటూంటే మాత్రం బాబు గారు అంతెత్తున లేస్తున్నారు. విశాఖ వద్దు, అమరావతి ముద్దు అంటున్నారు అని మండి పడ్డారు. ఈ నేపథ్యం లోనే అసలు అమరావతి లో ఏముంది, అంతా విశాఖలోన ఉందని బొత్స అంటున్నారు. అమరావతికి విశాఖకు పోలిక పెడితే తాను విశాఖకే నూరు మార్కులు వేస్తానని, అదే అమరావతి కి మాత్రం సున్నా మార్కులే వస్తాయని కూడా చెప్పేస్తున్నారు.

హైటెక్ సిటీ విశాఖ లో కట్టాలి కానీ తుళ్ళూరు లో కట్టగలమా అంటూ బొత్స ప్రశ్నిస్తున్నారు. అమరావతి కి  ఎంత చేసినా విశాఖ అవుతుందా అని కూడా గట్టిగానే అడుగుతున్నారు.విశాఖ టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా ఉంది. రాజధాని గా చేస్తే హైదరాబాద్ నే తలదన్నేలా డెవలప్ అవుతుందని కూడా బొత్స అంటున్నారు. రాజధాని రాజసం మొత్తానికి విశాఖకే ఉందని బొత్స గంటా పథంగా చెప్పారు.


Tags:    

Similar News