ఏపీ రాజకీయాలలో పాత్రధారులు సూత్రధారులు ఎవరో తేలిపోయింది. అధికార వైసీపీలో అంతా తానై వ్యవహరిస్తున్న జగన్ కి వ్యూహాలు చెప్పేందుకు పీకే టీం కుదురుకుంది. ఇక ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి రావడానికి చూస్తున్న టీడీపీకి ఒక వ్యూహకర్త ఉన్నారు. ఆయనే రాబిన్ శర్మ. ఈయన మొత్తం టీడీపీ ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేస్తున్నారు.
ఈయన ఎవరో కాదు ఫ్లాష్ బ్యాక్ లో పీకే టీం లో మెంబరే. సో ఒక విధంగా పీకే గురువు అయితే శిష్యుడు రాబిన్ శర్మ అన్న మాట. ఈ ఇద్దరూ ఇపుడు ఏపీలో రాజకీయ సమరం సాగిస్తున్నారు అని చెప్పాలి. తెర ముందు జగన్ కనిపిస్తున్నా అన్ని సలహాలూ సూచనలు పీకే టీం నుంచే వెళ్తాయి. అలాగే చంద్రబాబుకు కూడా రాబిన్ శర్మ నుంచే అలాంటి గైడెన్స్ వస్తోంది.
దాంతో బయటకు కనిపించే జగన్ కానీ చంద్రబాబు కానీ తాము చేసే యుద్ధాలకు ఆయుధాలను సమకూర్చేందుకు జాగ్రత్తగా గురు శిష్యులను ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు. పీకే టీం ఇప్పటికే జనాల్లోకి వెళ్ళి అధికార వైసీపీకి ఉన్న బలాలు బలహీనలతు గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. అలాగే రిపేర్లు ఏమి చేయాలో చెబుతోంది. ఏమి చేస్తే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది అన్నది కూడా తెలియచేస్తోంది.
అలాగే ఎమ్మెల్యేల పనితీరుని కూడా స్టడీ చేస్తూ ఎవరు పెద్దగా పెర్ఫార్మ్ చేయరో గుర్తించి వారికి టికెట్లు ఇవ్వరాదని కూడా సూచించేది పీకే టీం అని అంటున్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని రెడీ చేసింది పీకే టీం. అలా జనాలతో ఎమ్మెల్యేలు మమేకం కావాలని చెప్పినది కూడా ఈ టీమే. దాంతో ఎమ్మెల్యేలు ఇపుడు జనంలో తిరుగుతున్నారు. మరి వారికి ధీటుగా టీడీపీ నేతలు కూడా జనంలో ఉండాలి కదా.
వీరి కోసం రాబిన్ శర్మ డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇదేమి ఖర్మ అన్న నిరసన కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా జనంలోకి తెలుగు తమ్ముళ్ళు వెళ్ళి ప్రభుత్వం గత మూడున్నరేళ్ళుగా చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన గురించి వివరిస్తారు అన్న మాట. ఇదేమి ఖర్మ కార్యక్రమాన్ని రాబిన్ శర్మ టీం పూర్తిగా పర్యవేక్షిస్తుంది. ప్రతీ నియోజకవర్గానికి ఒక టీం మెంబర్ ని కూడా కేటాయించారు.
ఇప్పటికైతే రాబిన్ శర్మ టీం ప్రతీ క్లస్టర్ స్థాయిలోనూ మీటింగ్ పెడుతూ ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న దాని మీద టీడీపీ నేతలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అయితే ఇదేమి ఖర్మ కార్యక్రమం మీద ఇప్పటికే నెగిటివిటీని వైసీపీ ప్రచారం చేస్తోంది. దాంతో దీని మీద అపుడే విమర్శలు వచ్చాయి.
ఇదేమి ఖర్మరా బాబూ అంటే కచ్చితంగా అది టీడీపీకే చంద్రబాబుకే తగులుతుంది. కానీ ఈ కార్యక్రమం గురించి జనంలోకి తీసుకెళ్లారు కాబట్టి ఇక తప్పదనుకుని దీన్నే టీడీపీ భారీ ఎత్తున చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి జనం నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి చూస్తూంటే అటు జగన్ని మరోసారి అధికారంలోకి తేవాలని పీకే టీం క్షేత్ర స్థాయిలో పనిచేస్తూంటే బాబుని సీఎం కుర్చీలో ఎక్కించాలని రాబిన్ శర్మ టీం పనిచేస్తోంది. మరి ఈ ఇద్దరి వ్యూహాలలో ఏది సక్సెస్ అవుతుంది ఎవరు అసలైన విజేత అవుతారు అన్నది కూడా ఇపుడు ఇంటరెస్టింగ్ మ్యాటరే మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.