విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రికార్డుల టాంపరింగ్ స్కామ్ పై సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇంతపెద్ద కుంభకోణాన్ని ఎప్పుడూ చూడలేదని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు - లోకేశ్ ఆధ్వర్యంలోనే భూస్కామ్ జరుగుతోందని ఆరోపించారు.
భూకుంభకోణాలతో విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భారీ కుంభకోణానికి తెరతీశారని ఆయన ఆరోపించారు. 3 లక్షల అడంగల్ కాపీలు కనిపించడం లేదని ఆయన చెప్పారు. అడ్డగోలుగా భూములు ఆక్రమించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. 3 లక్షల అడంగల్ కాపీలు కనిపించడం లేదని అడిగితే హుద్‌హుద్ తుపానులో కొట్టుకుపోయారని అంటున్నారని బొత్స తెలిపారు.
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ఆయన ప్రశ్నించారు. వేల ఎకరాల భూములను దోచేస్తున్నారని, ప్రభుత్వ భూములను కాపాడుకోలేని పరిస్థితి ఉందని వాపోయారు. అసలు విశాఖలో ఏం జరుగుతుందో చెప్పాలని ముఖ్యమంత్రిని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ ప్రమేయం లేకుండా జరగదని మంత్రులే అంటున్నారని తెలిపారు. ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోరు? ఎవర్ని కాపాడేందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/