ఆ పీకే హిట్... ఈ పీకే ఫట్ !
పీకే అంటే తెలుగు నాట ఇద్దరు కనిపిస్తారు. పవర్ స్టార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని షాట్ కట్ లో పీకే అని పిలుస్తారు.
పీకే అంటే తెలుగు నాట ఇద్దరు కనిపిస్తారు. పవర్ స్టార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని షాట్ కట్ లో పీకే అని పిలుస్తారు. అలాగే మరో పీకే ఉన్నారు. ఈయన బీహారీ బాబు. ఈయన గత దశాబ్ద కాలంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా దేశవ్యాప్తంగా పేరు గడించారు. అన్నిటికీ మించి ఆయన 2019లో వైసీపీ వెనక ఉండి రచించిన వ్యూహాలతో ఏకంగా 151 సీట్లను వైసీపీ సాధించింది.
ఆ అద్భుతం తరువాత పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ పేరు మారు మోగింది. అలా పీకేతో ఏపీకి మంచి అనుబంధం ఏర్పడింది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రాజకీయంగా ఒక దశాబ్దం పాటు ఇబ్బంది పడ్డా ఇపుడు చూస్తే కనుక ఆయన ప్రభ ఒక రేంజిలో వెలిగిపోతోంది. ఇంటా బయటా పవన్ మానియా ఒక రేంజిలో ఉంది.
ఈ నేపథ్యంలో దేశంలో తాజాగా రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అలాగే దేశంలోని 15 రాష్ట్రాలకు జరిగిన 48 శాసనసభల ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాంతో ఒక పీకే ప్రాభవం అమాంతం జాతీయ స్థాయిలో వెలిగిపోతే మరో పీకే పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా రిజల్ట్స్ షాక్ ఇచ్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం అనుకుంటే ఆయన పొరుగు రాష్ట్రాలలో తన సత్తాను ఘనంగా చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో విగరస్ గా చేసిన ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే కూటమి కనీ వినీ ఎరగని విజయం సాధించింది. ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎన్డీయే కూటమి మహారాష్ట్ర ఎన్నికల్లో అందుకుంది.
ఇక ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే మాత్రం ఈ ఎన్నికల ఫలితాలతో చతికిలపడ్డారు. బీహార్ లో జరిగిన నాలుగు అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో పీకే కొత్త పార్టీ సత్తా చాటలేక బోల్తా పడింది. అంతే కాదు కనీస మాత్రంగా ప్రభావం చూపించలేకపోయింది.
తరారీ, రాం గఢ్, బెలగంజ్, ఇమాం గంజ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయభేరీ మోగించింది. ఇక్కడ బీజేపీ దాని మిత్ర పక్షం జేడీయూ గెలిచాయి. అయితే విపక్షానికి చెందిన ఆర్జేడీ రెండో స్థానానికి పరిమితం అయితే మూడవ స్థానంలో పీకే పెట్టిన కొత్త పార్టీ జన్ సురాజ్ నిలిచింది.
అలా జనాలు పీకే పార్టీని తీసి పక్కన పెట్టేశారు అని అంటున్నారు. దాంతో ఈ ఎన్నికల వ్యూహకర్త వ్యూహాలు కాస్తా ఆయనకే బెడిసికొట్టాయా అన్న చర్చకు తెర లేచింది. అయినా కొత్త పార్టీ ఎవరైనా పెడితే నేరుగా మొత్తం అసెంబ్లీ ఎన్నికలకే పోటీ చేస్తారు. అలా తమ గుప్పిట పార్టీ ఇమేజ్ ని దాచి పెడతారు
కొత్త పార్టీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో అన్న అలజడిని ఇతర పక్షాల్లో కలిగిస్తారు మరో వైపు చూస్తే ఉప ఎన్నికలు అంటే సాధారణంగా అధికారంలో ఉండే పార్టీలకే కలసి వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే పనులు అవుతాయని సగటు ఓటరు భావిస్తారు దాంతో పాటు అధికారం అంగబలం అన్నీ కలసి అధికార పార్టీ కి భారీ పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది అని అంటున్నారు
మరి దేశంలోనే బడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన పీకేకి ఈ లాజిక్ తెలియదా అనుకుంటున్నారు. అన్నీ తెలిసి ఆయన ఈ విధంగా ఉప ఎన్నికల పోరులో తన కొత్త పార్టీని నిలపడం ఏమిటి అని అంటున్నారు. దీని వల్ల పీకే పార్టీ స్టామినా ఏపాటి అని మొత్తానికి తెలిసి పోయింది అని అంటున్నారు.
ఇక బీహార్ లో చూస్తే ఎన్డీయే స్ట్రాంగ్ గానే ఉందని లేటెస్ట్ ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఇక అధికార కూటమి మీద బోర్ కొడితే అందుకొవడానికి విపక్ష ఆర్జేడీ ఉందని కూడా ఈ ఫలితాలను బట్టి అర్ధం అయింది. బీహార్ లో పొలిటికల్ గా చూస్తే వాక్యూం ఏమీ లేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పీకే జన సురాజ్ మనవిని జనాలు విన్లేదని అంటున్నారు.
దాంతో 2025 నవంబర్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పీకే మొత్తం సీట్లకు పోటీ చేసి తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఒక సినిమాను తెర వెనక బ్రహ్మండంగా తీసిన దర్శకుడు తానే హీరోగా నటించి సక్సెస్ కొట్టలేరు అన్నది పీకే రూపంలో ఈ విధంగా రుజువు అయిందా అని అంటున్నారు.