వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన బొత్స సత్యనారాయణ తన ప్రకటనలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒకింత ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. బాగా చర్చించుకుని ఒక అభిప్రాయానికి రావాల్సిన అంశాల్లో బొత్స తన సొంత ప్రకటనలు చేస్తున్న వైనాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి రాజధాని విషయంలో బొత్స సత్తిబాబు ప్రకటనలు వివాదంగా మారాయి. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా ఉన్నాయి బొత్స వ్యాఖ్యలు.
రాజధానిని తరలిస్తామని ఇప్పటి వరకూ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా ప్రకటించలేదు. ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ జగన్ మోహన్ రెడ్డి ఆ ప్రకటనలు ఏవీ చేయలేదు. అయితే బొత్స చేసిన ప్రకటనలతో రచ్చ రేగింది. ఆ రచ్చను తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. తెలుగుదేశం వాళ్లు - బీజేపీ - జనసేన వీళ్లంతా ఇప్పుడు రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నట్టుగా అదో ప్రజా ఉద్యమం అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ ఉన్నాయి.
ఇంతజేసీ రాజధాని మార్చే ఉద్దేశం ఉందని జగన్ ప్రకటించనే లేదు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నవనగరాలు - గ్రాఫిక్స్ జగన్ కు ఆసక్తి లేకపోవచ్చు గాక. జగన్ వికేంద్రీకరణకే మొగ్గు చూపే అవకాశాలూ ఉండవచ్చు గాక. రాజధాని మార్పు అనే ఊసే లేకుండా వ్యవహారాన్ని జగన్ నడిపించే అవకాశం ఉండేది. అమరావతి నుంచినే పాలన వ్యవహారాలు సాగిస్తూ అదే రాజధాని అనే ఫీలింగ్ ను జగన్ కొనసాగించగలరు.
అయితే మధ్యలో బొత్స చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ప్రత్యర్థులకు ఒక అవకాశాన్ని ఇచ్చాయి. ఇలాంటి హడావుడి ఏమీ లేకుండా వికేంద్రీకరణ చేసే అవకాశం ఉంది. అలా కామ్ గా పని చేసే అవకాశం లేకుండా బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలతో రచ్చ రేపారు. ఈ వ్యవహారం పై ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించక తప్పని పరిస్థితిని కల్పించారు ఈ మంత్రిగారు.