ఏపీ మూడు రాజధానుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారుతుంది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందగా ..నేడు ఈ బిల్లుని శాసనమండలి ముందుకు ప్రభుత్వం తీసుకువచ్చింది. మంగళవారం శాసనమండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. మూడు రాజధానుల బిల్లును శాసన మండలి లో ఆమోదింపజేసుకోవడం కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అడ్డదారులు తొక్కిందని మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఫోన్లు వచ్చాయని, కొందరు సానుకూలంగా స్పందించారని తమకు తెలిసిందని ఆయన అన్నారు. అయితే , టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన అసత్య ఆరోపణల పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దమ్ముంటే ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశామో యనమల గానీ, టీడీపీ నాయకులు గానీ నిరూపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. తాము ఎవరికీ ఫోన్ చేయలేదని, ఆ అవసరం తమకు లేదని అన్నారు. ఇక ఇదే సమయంలో బిల్లుకు సమయం కావాలని యనమల ఆడగడం పై మంత్రి బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని, బిల్లు పెట్టి గంటలో చర్చ చేపట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా టీడీపీకి ఇష్టం వచ్చినట్లు సభా నడపాలా అని బొత్స ప్రశ్నించారు.