బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్ట్..పాక్ ఏజెంట్ అరెస్ట్

Update: 2018-10-09 06:57 GMT
బ్రహ్మోస్.. ఈ సూపర్ సోనిక్ క్షిపణిని భారత్-రష్యా సంయుక్తంగా తయారు చేశాయి. మొదట్లో రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసింది. ఉమ్మడిగా తయారు చేసిన ఈ క్షిపణి సైన్యంలోకి కూడా వచ్చేసింది. అయితే భారత శాస్త్రవేత్తలు దీనిపై కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చడంతోపాటు దాంట్లో అనే కొత్త వ్యవస్థల్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీన్నో అధునాతన క్షిపణిగా తీర్చిదిద్దుతున్నారు.

అయితే ఈ పరిశోధన  - అభివృద్ధిలో భాగస్వామ్యమైన ఉత్తరప్రదేశ్ కు చెందిన నిషాంత్ అగర్వాల్ అనే ఏరోస్సేస్ ఇంజనీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కు బ్రహ్మోస్ క్షిపణి సమాచారాన్ని లీక్ చేశాడనే అభియోగంపై ఇతడిని కస్టడీలోకి తీసుకున్నారు. నిశాంత్ నాలుగేళ్లుగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ క్షిపణి పరీక్ష కేంద్రంలో పనిచేస్తున్నాడు. బ్రహ్మోస్ సాంకేతిక సమాచారం అతడు పాక్ తోపాటు మరిన్ని దేశాలకు చేరవేసి ఉండవచ్చని అతడి కార్యాలయంలోని కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకొని తనిఖీలు చేస్తున్నారు..

అయితే నిశాంత్ కు ఫేస్ బుక్ ఐడీలతో అమ్మాయిలను ఎరవేసి.. భారీగా డబ్బులు విసిరి పాక్ ఈ గూఢచర్యం చేయించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ క్షిపణి.. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, మద్యస్థాయి క్షిపణి.దీన్ని జలాంతర్గామి, నౌకలు, విమానాలు, భూమి ఉపరితలం ఇలా అన్ని రకాలుగా వాడే వీలుంది. అందుకే దీనిపై పాక్ తోపాటు ఇతర దేశాల వారు కన్నేసి సాంకేతిక కాజేయడానికి ట్రే చేస్తున్నాయి. ఇలానే నిశాంత్ ను ప్రలోభ పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Tags:    

Similar News