పాకిస్తాన్ ఉగ్రమూకలు దేశంపై సరికొత్త దాడిని మొదలుపెట్టాయి. భారత్ పై తొలి డ్రోన్ దాడి ఆదివారం జరిగింది. ఉగ్రమూకలు డ్రోన్ల సహాయంతో జమ్ములోని వాయుసేన ఎయిర్ పోర్టులోని హ్యాంగర్లపై దాడి చేసింది. అయితే వాయుసేనకు చెందిన ఆయుధాలకు వారి వాహనాలకు ఎలాంటి నష్టం జరగలేదు. ఇద్దరు సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. భారత్ లో జరిగిన తొలి డ్రోన్ దాడి కావడంతో రక్షణ విభాగం హై అలెర్ట్ అయ్యింది.
శనివారం అర్ధరాత్రి 1.30 సమయంలో గుర్తు తెలియని డ్రోన్లు తక్కువ ఎత్తులో జమ్ము వాయుసేన స్థావరాలపై దాడి చేశాయి. స్థావరంలోని హ్యాంగర్ల వద్ద పెద్ద పేలుడు పదార్థాలను జారవిడిచాయి. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో చోట ఇదే తరహాలో పేలుడుకు పాల్పడ్డాయి.
ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. అయితే పేలుడు జరిగిన ప్రదేశాలకు సమీపంలోనే ఎంఐ17 హెలిక్యాప్టర్లను భద్రప్పే గోదాములు ఉండడంతో తొలుత ఆందోళనకు గురయ్యారు. అయితే వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఈ ఘటన జరిగిన వెంటనే వాయుసేన బృందాలు అక్కడికి చేరుకున్నాయి. వాయుసేన విమానాలకు ఉగ్రమూకలు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ దాడిని మాత్రం భారత రక్షణ వ్యవస్థ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఎందుకంటే ఇది భారత్ లో డ్రోన్ల ద్వారా జరిగిన తొలి దాడిగా వారు చెబుతున్నారు.
ఈ పేలుళ్లలో ఒక భవనంపైకప్పు కొద్దిగా ధ్వంసం అయ్యింది. అయితే ఈదాడి జరిగే ముందు మన రక్షణ వ్యవస్థలో ఉండే రాడార్ గుర్తించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఐఏఎఫ్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.