భారత్ లోనూ కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జనం ఎక్కువగా ఉండే కార్యక్రమాలు రద్దు చేయడం తోపాటు...జనం ఎక్కువగా తిరిగే ప్రదేశాలను మూసి వేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా...థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేతపై జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ఏపీలోని దేవాలయాలపై కూడా పడింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల ఆలయంలోకి భక్తులను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను యథావిధిగా నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి భక్తులను పంపించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు, రేపు ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్డులు మూసివేస్తామని టీటీడీ ప్రకటించింది.
కలియుగ దైవం వెంకన్న సన్నిధికి రోజూ వేలాది మంది స్వదేశీ, విదేశీ భక్తులు వస్తుంటారు. తిరుమలలో కరోనా వ్యాప్తికి ముమ్మరంగా అవకాశాలున్నాయి. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన మహారాష్ట్ర భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న దామోదరం అనే వ్యక్తిని రుయా ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగంలో వైద్యం అందిస్తున్నారు. కరోనా సోకిందో లేదో తెలుసుకునేందుకు ఇతడి శాంపిల్స్ ను పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ అత్యవసర సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై టీటీడీ అధికారులు అత్యవసరం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి దర్శనం నిలిపివేత తో పాటు, రెండు ఘాట్ రోడ్ లను మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. మరోవైపు, శ్రీశైలం ఆలయాన్ని దర్శించేందుకు వచ్చిన ఇజ్రాయెల్ వాసులను టోల్‌గేట్ వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో, భద్రతా సిబ్బంది తో వారు వాగ్వాదానికి దిగారు. కొద్ది రోజుల పాటు విదేశీయులకు దేవుడి దర్శనం అనుమతి లేదంటూ అధికారులు చెప్పడం తో వారు వెనుదిరిగారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గానూ ఇప్పటికే తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే