యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆ ప్రభావం మిగతా దేశాలపైనా పడుతోంది. యూరోపియన్ యూనియన్లోని మిగతా కొన్ని దేశాలు కూడా తాము కూడా ఈయూ నుంచి బయటపడాలని అనుకుంటున్నాయి. గ్రీస్ - ఫ్రాన్సు వంటి దేశాల్లో ఇప్పటికే ఈ భావన బలంగా ఉంది.
అయితే.. బ్రెగ్జిట్ ఎఫెక్టు ఐరోపాను దాటి అమెరికాకు కూడా పాకినట్లుంది. బ్రిటన్ ఎగ్జిట్ కు మద్దతు తెలిపిన అమెరికాలోనూ ఇప్పుడు అలాంటి ప్రభావం పడుతోంది. బ్రెగ్జిట్ సెగ అమెరికాను తాకుతోంది. టెక్సాస్ లోని పలు రాజకీయ పార్టీలు అమెరికా నుంచి తాము విడిపోతామని పోరాటం ప్రారంభించారు.
టెక్సాస్ రాష్ట్రం 155 ఏళ్ల కిందట అమెరికాలో చేరింది. యూఎస్ లో చిట్టచివరగా చేరిన రాష్ట్రం టెక్సాసే.. ఇప్పుడు ఆ రాష్ట్రం మళ్లీ అమెరికా నుంచి విడిపోవాలని అనుకుంటోంది. ఆ దిశగా రాజకీయ ఉద్యమం మొదలైనట్లుగా తెలుస్తోంది. టెక్సాస్ తో పాటు మరిన్ని రాష్ర్టాలు వేరుపడాలని అనుకుంటే అమెరికాకు అగ్రరాజ్యం అన్న ట్యాగ్ తొలగిపోవడం ఖాయం.