యూరోపియన్ దేశాలన్ని కలిసి కట్టుగా ఉండాలంటూ కలిసిపోయిన వైనం మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటానికి ఉద్దేశించిన బ్రెగ్జిట్ మరికొద్ది గంటల్లో అధికారికంగా కానుంది. దీంతో.. ఇంతకాలం కలిసిమెలిసి ఉన్న వారు విడిపోతున్నారు. ఈయూతో బ్రిటన్ విడాకుల పర్వం పూర్తి అవుతుంది. డిసెంబరు 31 రాత్రి 11 గంటల తర్వాత నుంచి బ్రెగ్జిట్ ఒప్పందం అమల్లోకి రానుంది. దీంతో.. తెగతెంపులు లాంఛనంగా పూర్తి అయినట్లే.
కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి ఈయూ వేరు.. బ్రిటన్ వేరుగా ఉండనుంది దీంతో.. ఇంతకాలం ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు చాలా వరకు ఉండవు. అయినప్పటికీ ఈయూ పెద్ద మనసుతో.. తమ నుంచి విడిపోయిన బ్రిటన్ కు కొన్ని మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక.. ఐరోపా దేశాల యూనియన్ నుంచి బయటకు వచ్చేస్తున్న తీసుకున్న నిర్ణయంపైనా బ్రిటన్ లోనూ ఒకింత ఆశ్చర్యం.. అంతే నిరాశ కనిపిస్తోంది. విడాకులు తీసుకోవటాన్ని సమర్థించే వారికి తగ్గట్లే.. వ్యతిరేకించే వారు లేకపోలేదు.
యూరోపియన్ యూనియన్ తో తాము కలిసి ఉండటం వల్ల ఆర్థికంగా భారంగా మారింది. ఎలాంటి లాభం జరగటం లేదన్న భావన బ్రిటన్ లోని కొన్ని వర్గాల్లో పెరిగింది. అది పెద్దదై.. చివరకు ఈయూ నుంచి బయటకు వచ్చేలా చేసింది. 2013లో జరిగిన ఎన్నికల్లో తాము నెగ్గితే ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించాలా? వద్దా? అన్న అంశంపై రెఫరెండం పెడతామంటూ డేవిడ్ కామెరూన్ హామీ ఇచ్చారు. ప్రధాని కాగానే 2016లో ఆ పని చేశారు. నిజానికి బ్రెగ్జిట్ కు కామెరూన్ వ్యతిరేకి. కానీ.. దానికి అనుకూలంగా 52 శాతం మంది ఓటు వేయటంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావటంఅనివార్యం అయ్యింది. దీంతో.. తన నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు రావటంతో ప్రధానిగా వ్యవహరించిన ఆయన.. తన పదవికి రాజీనామా చేశారు.
రెఫరెండమ్ తీర్పునకు తగ్గట్లు 2019 మార్చి 29 నాటికి బ్రెగ్జిట్ పూర్తి కావాల్సింది. కానీ.. దీనికి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం లభించలేదు. దీంతో.. ప్రధానిగా వ్యవహరించిన థెరెసా మే రాజీనామా చేశారు. ఆమె స్థానంలో వచ్చిన బోరిస్ జాన్సన్ అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని ఈయూతో కొత్త ఒప్పందం చేసుకొని విడాకుల పర్వాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా పార్లమెంటు కూడా ఓకే చెప్పటంతో.. కొత్త ఏడాది ప్రారంభం కావటానికి గంట ముందుగా (డిసెంబరు 31 రాత్రి పదకొండు గంటల సమయానికి) తెగతెంపులు పూర్తి అవుతాయి. దీంతో.. ఈయూ.. బ్రిటన్ ఎవరి దారి వారిదన్నట్లు కానుంది.