హవ్వా..పార్లమెంటులో బూతు వీడియోలు కావాలట..

Update: 2018-05-19 07:55 GMT
ప్రజాప్రతినిధులన్నాక కుసింత భయం భక్తి ఉండాలని ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు సెలవిచ్చారు.. కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులకు భయం - భక్తితోపాటు సిగ్గూ - శరం కూడా లేకుండా పోయింది.. ప్రజాసమస్యలను పక్కన పెట్టేసి ఏకంగా పార్లమెంట్ లోనే తమకు పోర్న్ చూసేలా యాక్సెస్ ఇవ్వాలని కోరడం తాజాగా సంచలనమైంది. ఇదేదో భారత పార్లమెంట్ లో అనుకునేరు.. బ్రిటీష్ పార్లమెంట్ లో.. అక్కడ ఎంపీలు తమకు పోర్న్ సైట్ చూసే యాక్సిస్ ఇవ్వాలని.. ఏకంగా 24473 విన్నపాలు ఇచ్చారట.. దీనిపై బ్రిటన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు..

బ్రిటన్ ఎంపీలు తమకు బూతు సైట్లను చూసేందుకు యాక్సెస్ అడిగారనే  విషయాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఎఫ్ ఓఐ) పేరిట బ్రిటన్ ప్రెస్ అసోసియేషన్ సేకరించింది. గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు అశ్లీల వెబ్ సైట్ లు యాక్సెస్ ఇవ్వాలని రోజుకు 160 రిక్వెస్ట్ లు వచ్చినట్లు తెలిసింది.

కాగా బ్రిటన్ పార్లమెంట్లోని ఎంపీల్లో పలువురిపై ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్దఎత్తున ఉన్నాయి. దీంతో మళ్లీ పోర్న్ చూడడానికి అదీ పార్లమెంట్ లో యాక్సెస్ ఇవ్వాలని ఎంపీలు కోరడంపై బ్రిటన్ ప్రధాని థేరిసా మే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రధాని థెరిసాకు స్నేహితుడైన మంత్రి డామియన్ గ్రీన్ ను ఈ ఏడాది తొలగించారు. ఆయన కంప్యూటర్లలో అశ్లీల వీడియోలు లభించినప్పటికీ పోలీసులను తప్పుదారి పట్టించారని ఆరోపణలు రావడంతో ప్రధాని తొలగించింది.

ఇలా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులే ఏకంగా దేవాలయం లాంటి పార్లమెంట్ లోనే సెక్స్ వీడియోల కోసం అర్రులు చాచారు. ఇక బయట వారిని ఆపడం సాధ్యమేనా.? అన్న ప్రశ్న ఉదయిస్తోంది..
Tags:    

Similar News