పవన్ కల్యాణ్ ఫ్రెండ్స్.. అడ్రస్ గల్లంతు!

Update: 2019-05-24 04:44 GMT
జనసేన ఈ ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తును ముందు నుంచినే ఖరారు చేసిన పవన్ కల్యాణ్ - ఆఖర్లో మాయవతి పార్టీ బీఎస్సీకి పెద్ద పీట వేశారు! ఏనుగు గుర్తు పార్టీకి చాలా సీట్లే ఇచ్చేశారు పవన్ కల్యాణ్. ప్రధానంగా ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే సీట్లను బీఎస్పీకి ఇచ్చేశారు. మాయవతిని పిలిపించుకున్నారు.

ఆమెకు వీలైనన్ని సార్లు కాళ్ల మీద పడి దండం పెట్టారు పవన్ కల్యాణ్.దళిత ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని పవన్ కల్యాణ్ ఆ ఫీట్లన్నీ చేశారనేది ఓపెన్ సీక్రెట్. దళిత ఓటు బ్యాంకులో మెజారిటీ భాగం వైఎస్ ఆర్ కాంగ్రెస్ వైపు ఉంటుందనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. బీఎస్పీతో పొత్తు ద్వారా పవన్ కల్యాణ్ ఆ విషయంలో జగన్ పార్టీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడి స్కెచ్ అనే వాళ్లు కూడా ఉన్నారు.

కమ్యూనిస్టులు - బీఎస్సీలతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికలకు వెళ్లారు. అయితే వీరిలో డిపాజిట్లు సంపాదించిన వాళ్లు మాత్రం అతి తక్కువమంది మాత్రమే. సీపీఐ - సీపీఎంలు చెరో ఏడు ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేశాయి. బీఎస్పీ ఇరవైకి పైగా ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసింది.

అయితే కనీసం పది వేలకు పైగా ఓట్లు సంపాదించిన అభ్యర్థులు.. ఈ పార్టీలన్నింటి తరఫునా కలిపి కేవలం నలుగురు మాత్రమే అని స్పష్టం అవుతోంది. మంగళగిరి - ఉండి - రంపచోడవరం - విజయవాడ సెంట్రల్ ఈ నియోజకవర్గాల్లో మాత్రమే పవన్ కల్యాణ్ ఫ్రెండ్స్ కనీసం పది వేల కు పైగా ఓట్లను సాధించారు.

పవన్ కల్యాణ్ మీద కమ్యూనిస్టు పార్టీలు చాలా ఆశలే పెట్టుకుని కనిపించాయి. ఈ సారైనా తమకు ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కుతుందని ఆ పార్టీలు ఆశించాయి. అయితే ఆ ఆశలు అడియాసలయ్యాయి.


Tags:    

Similar News