మోడీ స‌ర్కార్ చివ‌రి బ‌డ్జెట్ హైలెట్స్

Update: 2019-02-01 07:17 GMT
2014లో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత మోడీ నేతృత్వంలో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. మోడీ ప్ర‌భుత్వంలో ఇప్ప‌టివ‌ర‌కూ నాలుగు బ‌డ్జెట్ల‌ను ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఈసారి బ‌డ్జెట్ కు దూరంగా ఉన్నారు. ఆయ‌న అస్వ‌స్థ‌తో ఉండ‌టంతో ఆయ‌న బ‌దులుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయిల్ బ‌డ్జెట్ ను స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో కీల‌కాంశాల్ని చూస్తే..

+ మోడీ సార‌థ్యంలో సుస్థిర పాల‌న అందించాం. వృద్ధిరేటులో 11వ స్థానంలో ఉన్న భార‌త్ ఆరో స్థానానికి చేరింది

+ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కోలుకోవాల‌ని దేవుడ్ని ప్రార్థించా.

+  సుస్థిర‌.. స‌మ్మిళిత వృద్ధి కొన‌సాగింపు ల‌క్ష్యంతో బ‌డ్జెట్ ను రూపొందించాం.

+  2020నాటికి న‌వ‌భారతం నిర్మిస్తాం.

+ దేశం ఆరోగ్యంగా.. ప‌రిశుభ్రంగా ఉండాలి.

+ రైతుల ఆదాయం రెండింత‌లు కావాలి

+ మ‌న‌ది అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశం

+  సంస్థాగతమైన ఆర్థిక సంస్కరణలలో ముందుకు సాగుతున్నాం

+  ద్రవ్యోల్బణం 4.6శాతానికి తీసుకొచ్చాం.

+ రికార్డు స్థాయిలో ఎఫ్‌ డీఐలు భారత దేశానికి వచ్చాయి.

+ జీఎస్‌ టీ సహా పన్నుల వ్యవస్థల్లో సంస్కరణలు అమలు చేస్తున్నాం.

+ రూ.3లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాం.

+ మా ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం. రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగాం.

+ మా ప్రభుత్వ పాలన దేశంలో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.

+ మా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని నిజాయతీగా అమలు చేస్తోంది.

+ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం.

+ గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించాం.

+ అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించాం

+  గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

+ గ్రామీణ సడక్‌ యోజనలో భాగంగా మూడింతల రహదారుల నిర్మాణం పెరిగింది.

+ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి రూ.60వేల కోట్లు ఖర్చు చేశాం.

+ 50కోట్ల మందికి అండగా ఆయుష్మాన్‌ భారత్‌

+ మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం

+ 22 రకాల పంటలకు మద్దతు ధర పెంచాం.

+ ప్రధానమంత్రి సడక్‌ యోజనకు రూ.19వేల కోట్లు ఖర్చు చేశాం.

+ ఇప్పటివరకూ రూ.3వేల కోట్ల పేదల ధనం ఆదా అయింది.

+ 2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం.

+ మొబైల్‌ లో డేటా వినియోగం 50రెట్లు పెరిగింది.

+ డిజిటల్‌ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాం.

+ జన్‌ ధన్‌ - ఆధార్‌ - మొబైల్‌ - డైరెక్ట్‌ ట్రాన్స్‌ ఫర్‌ లు కీలకంగా మారాయి.

+ ప్రపంచంలోనే డేటా - ఫోన్‌ ఛార్జీలు భారత్‌ లో తక్కువగా ఉన్నాయి.

+ గత ఐదేళ్లలో 34 లక్షల కోట్ల జన్‌ ధన్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి.

+ భారతీయ రైల్వేలకు రూ.64,500 కోట్లు కేటాయిస్తున్నాం. బ్రాడ్‌ గేజ్‌ లో కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ లను తొలగించాం.

+ పేద రైతుల ఆదాయం పెంపునకు చర్యలు చేపట్టాం.

+ కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద  రైతులకు ఏడాది రూ.6వేలు అందిస్తాం.

+ 2 హెక్టార్ల లోపల వ్యవసాయ భూమి ఉన్న రైతులు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు.

+ మూడు సార్లుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.దీంతో 1 2కోట్లమంది రైతులు లబ్ధి పొందుతారు.

+ గోకుల్‌ మిషన్‌ కోసం రూ.750కోట్లు కేటాయిస్తున్నాం.

+ గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ ధేన్‌ ఆయోగ్‌ ఏర్పాటు

+ ముద్ర యోజనలో రూ.7.23లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం.

+ దేశంలో 100 ఎయిర్‌ పోర్టులు క్రియాశీలకంగా ఉన్నాయి.

+ ప్రపంచంలోనే రహదారుల నిర్మాణం భారత్‌ లో వేగంగా సాగుతోంది.

+ రోజుకు 27కి.మీ. రహదారిని నిర్మిస్తున్నాం.

+ కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌ లను తొలగించాం.

+ అత్యధిక వేగంగా ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రానుంది.

+ ఈఎస్ ఐ పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచుతున్నాం.

+ రూ.15వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం.

+ కొత్త పెన్షన్‌ పథకం ప్రధాన మంత్రి శ్రమ్‌ యోగి మాన్‌ ధన్‌ కు రూ.500కోట్లు కేటాయింపు.

+ రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్దం.

+ 40ఏళ్లుగా పెండింగ్‌ లో ఉన్న వన్‌ మ్యాన్‌ వన్‌ పెన్షన్‌ అమలు చేశాం. దేశ రక్షణలో సైనికుల త్యాగం నిరుపమానం

+ ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్‌.

+ 60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్‌ వచ్చేలా ప‌థ‌కం.

+ నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌.

+ అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు

+ గ్యాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నాం.

+ కొత్త పెన్షన్‌ విధానం సరళీకరిస్తాం!

+ పెన్షన్‌ లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంపు.

+ కార్మికులు - కూలీల కోసం ప్రత్యేక పథకాలు.

+ ఈపీఎఫ్‌ వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది.

+ కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంపు

+ వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదు.

+ రూ.6.5లక్షల వరకూ ఉన్న వారు కూడా బీమా - పెన్షన్‌ ఫండ్‌ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీకి ఛాన్స్

+ గృహ రుణాలు - ఇంటిఅద్దెలు -. ఇన్సురెన్స్‌ లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు.

+ 3 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ది

+ స్టాండర్డ్‌ డిడక‌్షన్‌ రూ.50 వేలకు పెంపు

+ పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంపు

+ నెలకు రూ.50 వేల జీతం వరకు టీడీఎస్‌ ఉండదు.

+ సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్నులేదు.

+ వచ్చే ఐదేళ్లలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌.

+ రవాణా వాహనాల్లో భారత్‌ జోరు ఎక్కువైంది.

+ ఎలక్ట్రానిక్‌ వాహన వినియోగం పెరిగింది.

+ 2030కల్లా ఈ రంగంలో భారత్‌ దే సింహ భాగం
 
+ భారతీయ సినిమాల నిర్మాణం అనుమతి కోసం సింగిల్‌ విండో విధానం తీసుకురానున్నాం.

+ జీఎస్‌ టీ విధానంతో ఉత్పత్తిదారులు - వినియోగదారులకు ప్రయోజనం చేకూరింది.

+ ఎక్కువ వస్తువులు 0-0శాతం శ్లాబుల్లోనే ఉన్నాయి. 

+ ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై తర్వలో నిర్ణయం తీసుకుంటాం.
 
+ మంత్రి వర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి తుది నిర్ణయం తీసుకుంటాం.

+ ఉజ్వల యోజన కింద 8కోట్ల ఉచిత వంటగ్యాస్‌ కనెక్షన్లు

+ ముద్ర యోజనలో రూ.7.23లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం.

+ దేశంలో 100 ఎయిర్‌ పోర్టులు క్రియాశీలకంగా ఉన్నాయి.

+ ప్రపంచంలోనే రహదారుల నిర్మాణం భారత్‌లో వేగంగా సాగుతోంది.

+ రోజుకు 27కి.మీ. రహదారిని నిర్మిస్తున్నాం.

+  కాపలాదారులు లేని రైల్వే క్రాసింగ్‌ లను తొలగించాం.

+ అత్యధిక వేగంగా ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రానుంది.

+ మా ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం.

+ రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగాం.

+ మా ప్రభుత్వ పాలన దేశంలో ప్రతి ఒక్కరి ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.

+ ప్రతి కార్యక్రమాన్ని నిజాయతీగా అమలు చేస్తోంది.

+ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం.
Tags:    

Similar News