ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్.. జగన్ డ్రీం నెరవేరే చాన్స్...?

Update: 2023-01-21 00:30 GMT
ఏపీ శాసన సభ సమావేశాలు ఫిబ్రవరిలో జరుగుతాయని అంటున్నారు. నిజానికి మార్చిలో మొదలెట్టి నెలాఖరు వరకూ కంటిన్యూ చేస్తారు. కానీ ఏపీలో మార్చి నెలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. మార్చి 3,4 తేదీలలో విశాఖ వేదికగా గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహిస్తున్నారు. అదే నెల 28, 29 తేదీలలో జీ 20 సన్నాహక సదస్సు విశాఖలోనే నిర్వహిస్తున్నారు. అలా మార్చిలో చూస్తే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రెండు ఉన్నాయి.

దాంతో వాటితో క్లాష్ రాకుండా ముందే అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని బడ్జెట్ ని ఆమోదిస్తే బాగుంటుంది అని ప్రభుత్వ వర్గాలు ఆలోచిస్తున్నాయి అని అంటున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తరువాత మళ్లీ జరగలేదు. శీతాకాల సమావేశాలు నిర్వహిస్తారు అని వార్తలు వచ్చినా జరపలేదు. దాంతో ఈసారి బడ్జెట్ సెషన్ ని కనీసంగా పాతిక రోజుల పాటు నిర్వహిస్తారు అని అంటున్నారు.

ఈ బడ్జెట్ సమావేశాలలోనే కీలక బిల్లులను ఆమోదిస్తారు అని తెలుస్తోంది. అదే విధంగా మూడు రాజధానుల బిల్లుకు మోక్షం కలుగుతుంది అని అంటున్నారు. గతంలో మూడు రాజధానుల మీద ప్రభుత్వం చట్టం చేసి ఉప సంహరించుకుంది. ఇక అమరావతి రాజధాని మీద హై కోర్టు తీర్పు చెప్పేసింది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది అని కూడా స్పష్టం చేసింది.

దాని మీద ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఆ విచారణ ఈ నెలాఖరులోఉంది. దాంతో సుప్రీం కోర్టు ఏమి చెబుతుంది అన్నది చూసుకుని బడ్జెట్ సెషన్ లో మూడు రాజధానుల బిల్లుని ఆమోదిస్తారు అని అంటున్నారు. ఇక గతంలో జరిగిన తప్పులను పునరావృత్తం కాకుండా చూసుకోవాలని కూడా ప్రభుత్వం ఆలోచిసోంది.

ఈ ఏడాది ఉగాది నుంచి విశాఖ నుంచి పాలన చేయాలని జగన్ ఆశిస్తున్నారు. ఈసారి ఉగాది మార్చి నెలలో వస్తోంది. దాంతో దాని కంటే ముందు బడ్జెట్ సెషన్ లో ఒక చట్టం చేయడం ద్వారా అధికారికంగా పాలనను విశాఖ తీసుకెళ్లే ఉద్దేశ్యం ఉంది అని అంటున్నారు. ఒక విధంగా జగన్ డ్రీం ఈ బడ్జెట్ సెషన్ లో నెరవేరుతుంది అని అంటున్నారు.

ఈసారి బడ్జెట్ కూడా ఎన్నికల కోసం అన్నట్లుగా ఉంటుంది అని అంటున్నారు. బడ్జెట్ లో సంక్షేమం తో పాటు అభివృద్ధి పెద్ద పీట వేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దాంతో ఈసారి బడ్జెట్ లో అనేక కీలక ప్రాజెక్టులు కూడా కదిలే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

అదే విధంగా సంక్షేమ పధకాల విషయంలో కూడా మరిన్ని చేరుస్తారు అని వినిపిస్తోంది. తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు ఈ బడ్జెట్ సెషన్ కి సైతం హాజరయ్యే అవకాశాలు లేని వేళ రాజకీయ రచ్చ కంటే అధికార పార్టీ తీసుకువచ్చే బిల్లులు ఏంటి అన్న దాని మీదనే సమావేశాలు ఆసక్తిని పెంచే అవకాశం ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News