వైసీపీ ఎమ్మెల్యే లక్కును తొక్కేశారా... ?

Update: 2022-01-26 00:30 GMT
ఆయన రాజకీయం అదుర్స్. అందుకే  అనూహ్యంగా ఎమ్మెల్యే పదవిని చేపట్టారు. ఆయన వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయనే బూడి ముత్యాలనాయుడు.  నిజానికి మాడుగుల టీడీపీ కంచుకోట. పార్టీ పెట్టాక అయిదు సార్లు వరసగా గెలుచుకున్న సీటు అది. దాన్ని తొలిసారిగా 2004లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన గెలిచిన కరణం ధర్మశ్రీ బ్రేక్ చేశారు. ఇక 2009 నాటికి వస్తే టీడీపీ తరఫున గవిరెడ్డి రామానాయుడు గెలిచారు. కానీ 2014 నుంచి మాడుగులలో ఫ్యాన్ గిర్రున తిరగడం మొదలెట్టింది.

ఇక రెండు సార్లు గెలవడంతో బూడికి రాజకీయం బాగా అర్ధమైపోయింది. పైగా మాడుగుల మీద  పూర్తి పట్టు సాధించేశారు. మరో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ సర్దుకోకపోవడంతో బూడి హ్యాట్రిక్ విక్టరీ కొట్టేస్తారు అంటున్నారు. తాజాగా మాడుగులలో టీడీపీ చేసిన మార్పులతో మూడు ముక్కలాట రాజకీయం స్టార్ట్ అయిపోయింది. సడెన్ గా మాడుగుల టీడీపీ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని తీసేసి పీవీజీ కుమార్ కి ఆ బాధ్యతలు అప్పగించింది. దాంతో ఆయన తానే ఎమ్మెల్యే అభ్యర్ధిని అని ప్రచారం చేసుకుంటున్నారు.

ఇక పదేళ్ళుగా మాడుగుల మీద రాజకీయ పెత్తనం చేస్తున్న గవిరెడ్డి  అయితే అసలు తాను  వదిలేదు లేదు అంటున్నారు. ఆయన మాడుగుల మొత్తంగా ఉన్న తన అనుచరులతో సెపరేట్ గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తానే కాబోయే ఎమ్మెల్యే అభ్యర్ధిని అని చెబుతున్నారు.  ఇంకో వైపు చూస్తే  జనసేన నుంచి టీడీపీలో చేరి టికెట్ కోసం గత రెండు ఎన్నికల నుంచి గట్టిగా ట్రై చేస్తున్న సీనియర్ నేత  పైలా ప్రసాదరావు కూడా తనకంటూ ఒక వర్గాన్ని ముందు పెట్టుకుని సొంత రాజకీయం చేస్తున్నారు. ఆయన ఏమీ తక్కువ కాదు, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి అంతటి పోటీలోనూ 32 వేల ఓట్లను తెచ్చుకున్నారు.

ఇలా మాడుగుల టీడీపీ కాస్తా మూడుగా విడిపోవడంతో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ధీమాగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఖాయం. పార్టీలో పోటీ లేదు. పైగా మంత్రి రేసులో కూడా ఉన్నారు. ఒక వేళ మంత్రి అయినా కాకపోయినా కూడా తన కత్తికి ఎదురులేని విధంగా చేసుకోవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

రేపటి ఎన్నికల్లో ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారు యాంటీ చేస్తారు అంటున్నారు. మరి మాడుగుల లాంటి కంచుకోటలో పార్టీని చక్కదిద్దుకునే చర్యలను టీడీపీ చేపట్టపోతే ముచ్చటగా మూడవసారి కూడా అక్కడ పరాజయం తప్పదని అంటున్నారు.
Tags:    

Similar News